
ఈ విషయాన్ని డైరెక్టర్ రవిరాజా డైరెక్టర్ గానే రివిల్ చేశారు. తమిళ్ వర్షన్ లో భానుప్రియ పాత్రలో హీరోయిన్ ఖుష్బూ నటించారని.. అది కూడా శరత్ కుమార్ కి వదిన పాత్రలో కనిపించింది. డైరెక్టర్ రవిరాజా తెలుగులో ఈ పాత్రకు భానుప్రియ కరెక్ట్ గా సెట్ అవుతుందని ఎంపిక చేశారు. అయితే ఎంపిక చేసిన తర్వాత మోహన్ బాబు, భానుప్రియను తిరస్కరించడం జరిగిందట. డైరెక్టర్ రవిరాజా తన అభిప్రాయాన్ని హీరో రజనీకాంత్ కి చెప్పగా రజనీకాంత్ భానుప్రియ అయితేనే కరెక్ట్ గా సూట్ అవుతుందని మోహన్ బాబుకు సూచించారట.
దీంతో మోహన్ బాబు కి ఇష్టం లేకపోయినా కూడా హీరోయిన్ భానుప్రియ తోనే మాట్లాడించి ఒప్పించి మరి పెదరాయుడు సినిమాలో భాగమయ్యేటట్టు చేసామని రవిరాజా తెలియజేశారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.1994లో విడుదలైన నట్టమై ఆనే చిత్రాన్ని రీమిక్ గా మాతృకను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కూడా తెలకెక్కించింది రవి రాజానే. అయితే ఇందులో శరత్ కుమార్ లీడ్ పాత్రలో నటించగా ఈ సినిమా తెలుగు హక్కుల విషయంలో కూడా అప్పట్లో మంచి పోటీ ఉండడంతో మోహన్ బాబు ఈ హక్కులను దక్కించుకొని రజినీకాంత్ నటించి పెద్ద సహాయం చేశారని తెలిపారు రవి రాజా.