అమితాబ్ బచ్చన్ ని పిచ్చి పట్టింది అంటూ సోషల్ మీడియాలో ఎందుకు ట్రోల్ చేస్తున్నారు.అంత పెద్ద హీరోని పిచ్చి పట్టిందంటూ ఎందుకు అవమానించారు. ఇంతకీ సోషల్ మీడియాలో అమితాబ్ బచ్చన్ ట్రోలింగ్ కి గురవ్వడానికి అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అమితాబ్ బచ్చన్ 82ఏళ్ల వయసులో కూడా  సినిమాల్లో నటిస్తూ ఫ్యామిలీకి అండగా ఉంటున్నారు.ఒకప్పుడు కోట్లు సంపాదించిన ఈయన సడన్ గా డబ్బులన్ని పోగొట్టుకున్నారట.ఆ తర్వాత మళ్లీ సినిమాలు స్టార్ట్ చేసి వేలకోట్ల ఆస్తులు సంపాదించారు. దీనికి తోడు అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్ కూడా సినిమాల ద్వారా బాగానే సంపాదించారు.

ఇక సినిమాలు మాత్రమే కాకుండా అమితాబ్ బచ్చన్ కి పలు బిజినెస్ లు కూడా ఉన్నాయి. అయితే అలాంటి అమితాబ్ బచ్చన్ ని కల్కిలో చూసి చాలామంది షాక్ అయ్యారు.ఆయన స్టంట్స్ కి ఎంతోమంది షాక్ అయిపోయారు. ఎందుకంటే అంత పెద్ద వయసులో ఉన్న హీరో ఇలాంటి స్టంట్స్ చేయడం చేయడం అంత సులభం ఏమీ కాదు.అమితాబ్ బచ్చన్ ఎంత ఫిట్ గా ఉంటారో ఈ సినిమా చూసి అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఉన్న కొన్ని యాక్షన్ సీన్స్ కోసం డూప్ ని పెడదామని డైరెక్టర్ చెప్పినా కూడా వినకుండా నేనే చేస్తాను అని ధైర్యంగా చేశారట. ఇక ఈ విషయం పక్కన పెడితే అమితాబ్ బచ్చన్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్స్ ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు.

సైబర్ నేరాల మీద అవగాహన కలిగించడం కోసం లింకులు ఓపెన్ చేయొద్దు, ఓటిపిలు షేర్ చేయొద్దు అంటూ సైబర్ నేరగాళ్ళతో జాగ్రత్త అంటూ అమితాబ్ బచ్చన్ ఓ యాడ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ యాడ్ ప్రతిసారి చూసి చూసి బోర్ కొట్టడంతో కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అమితాబ్ బచ్చన్ ని ట్యాగ్ చేస్తూ తమ అసహనాన్ని వెళ్లగక్కారు.. కేవలం యాడ్ మాత్రమే కాదు ఎవరికైనా ఫోన్ చేద్దాం అన్న కూడా అమితాబ్ బచ్చన్ వాయిస్ తో సైబర్ క్రైమ్ కి సంబంధించి ఒక కాలర్ ట్యూన్ వస్తూ తెగ విసిగించేది.అయితే దీనికి సంబంధించి తాజాగా కొంతమంది ఆకాతాయిలు సోషల్ మీడియాలో అమితాబ్ ని నిందించేసరికి ఇవి చూసిన అమితాబ్ బచ్చన్ హర్ట్ అయిపోయి కోపంతో నన్నెందుకు అడుగుతున్నారు. ప్రభుత్వాన్ని అడగండి.నేను వాళ్ళు చెప్పిందే చేశాను.
ఇందులో నా తప్పేముంది అంటూ మండిపోయారు.అయితే అమితాబ్బచ్చన్ రియాక్ట్ అయిన తీరును చూసి మరికొంతమంది నెటిజన్లు ఏంటి ముసలాడికి పిచ్చి గాని పట్టిందా..ఎందుకు ఇంత గరం అవుతున్నాడు అంటూ కామెంట్లు పెట్టారు. అయితే ఈ కామెంట్ చూసి చిర్రెత్తుకుపోయిన అమితాబ్ బచ్చన్ ఏదో ఒక రోజు నువ్వు కూడా ముసలాడివి అవుతావు. ఎప్పటికీ అలాగే ఉండవు. వయసులో పెద్దవాళ్లు అనుభవంతో ఇలాంటి విషయాలు చెబుతారు. వారికి ఎంతో జ్ఞానం ఉంటుంది.ముందు ఈ విషయం నువ్వు గ్రహించు అంటూ ఆ నెటిజన్ కి కౌంటర్ ఇచ్చాడు అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం ఈ మ్యాటర్ వైరల్ గా మారడంతో అమితాబ్ బచ్చన్ ఆ నెటిజన్ తిక్క కుదిర్చాడు అంటూ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: