తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే దాని గురించి మనం సపరేట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు . ఒకపక్క సినిమాలు కూడా చేస్తున్నారు . తాను కమిట్ అయినా సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ మరొక పక్క పాలిటిక్స్ ని కూడా సరి సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాడు . పవన్ కళ్యాణ్ ఇప్పుడు నార్మల్ పవన్ కళ్యాణ్ కాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . అయితే ఆ విషయాన్ని మరిచిపోయి కొంతమంది ఆయనపై హద్దులు మీరిపోయి మాట్లాడుతున్నారు.   మురుగన్  మానాడు కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి దేవుడి గొప్పతనం గురించి చెప్పే ప్రయత్నం చేశారు  .


అయితే ప్రతి దాన్ని పొలిటికల్ పరంగా ఆలోచిస్తూ కొంతమంది పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు . పవన్ కళ్యాణ్ కి కౌంటర్ వేస్తూ చాలామంది ఆయనపై మండిపడ్డారు . నటుడు సత్యరాజ్ కూడా పవన్ కళ్యాణ్ మాటలపై స్పందిస్తూ కూసింత ఓవర్గానే హద్దులు మీరి పోయాడు . "ప్రజలు మీ మాటలు నమ్మే అంత అమాయకపు వ్యక్తులైతే కాదు దేవుడు జోలికి వచ్చి రాజకీయాలు చేయాలని చూస్తే తాటతీస్తాం " అనే రేంజ్ లో ఘాటుగా వ్యాఖ్యానించాడు .



దీని పట్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఫైర్ అయిపోయారు.  అయితే పవన్ కళ్యాణ్ నీ తిడితే ఆయన ఊరుకుంటాడేమో కానీ ఆయన ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు.  అలాంటి వాళ్ళలో సినిమా స్టార్స్ ఎంతోమంది ఉన్నారు. మరి ముఖ్యంగా తెలుగు డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కి వీర అభిమాని . ఈ విషయాన్ని ఎన్నోసార్లు బయటపెట్టాడు . ఈ క్రమంలోనే సత్యరాజ్ - పవన్ కళ్యాణ్ ని దురుసుగా మాట్లాడారు అన్న కోపంతో ఆయన తెరకెక్కిస్తున్న సినిమా నుంచి సత్యరాజ్ క్యారెక్టర్ ని లేపేసారట . ఆయన సినిమా నుంచి తీసేసారట . ఈ న్యూస్ ఇప్పుడు సినీ వర్గాలల్లో వైరల్ గా మారింది.

 

అయితే దీనిపై అఫీషియల్ గా చిత్ర బృందం స్పందించలేదు . హరీష్ శంకర్ కూడా అఫీషియల్ గా స్పందించలేదు . కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది . దీని పట్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పాజిటివ్గా స్పందిస్తున్నాడు . ఆయన నిజమైన పవని అభిమాని అంటే ఆయనే అంటూ సత్యరాజ్ ని సినిమా నుంచి తీసేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో  సోషల్ మీడియాలో మరొకసారి పవన్ కళ్యాణ్ సత్యరాజ్ ల పేర్లు బాగా వైరల్ అవుతున్నాయ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: