డైనమిక్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా కన్నప్ప . అవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్‌స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే  థియేటర్లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకుంది . అఫ్కోర్స్ సినిమాపై అడపా దడపా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ అదే విధంగా ప్రభాస్ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ లో ఉంది అంటూ జనాలు సినిమాకి ఓ రేంజ్ లో రివ్యూ ఇస్తున్నారు. ఈ సినిమాలో  స్పెషల్ రోల్  చేసిన ప్రతి ఒక్క స్టార్ కూడా అదరగొట్టేసారు అని .. మరీ ముఖ్యంగా మోహన్ లాల్ పాత్ర చాలా సర్ప్రైజింగ్ గా ప్లాన్ చేశాడు విష్ణు అని .. మలయాళీ అభిమానులకు ఈ పాత్ర బాగా నచ్చేస్తుంది అని జనాలు మాట్లాడుకుంటున్నారు . భారీ అంచనాల మధ్య నేడు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది.  మరి అక్కడ టాక్ ఎలా ఉంది ..? సినిమా హిట్టా..? ఫట్టా..? కన్నప్ప సినిమా గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


శివుడు గా అక్షయ్ కుమార్ పార్వతి దేవిగా కాజల్ తో  స్టార్ట్ అయిన ఈ సినిమా మొదటి భాగం మొత్తం కూడా తిన్నడు (మంచు) విష్ణు బ్యాక్ స్టోరీనే చూపిస్తారు. నాస్తికుడిగా.. ఇతర తెగలపై పోరాటం చేయడం లాంటి అంశాలతో సన్నివేశాలతో కొంచెం బోరింగ్ గా కథను ముందుకు  తీసుకెళ్లాడు డైరెక్టర్. అయితే తిన్నడు ప్రేమ కథలో రొమాంటిక్ ట్రాక్ .. అవసరమైన యాక్షన్స్ అన్ని స్లోగా ఉంటాయ్.  అదేవిధంగా కథనం మరి స్లోగా ఉండడం సినిమాకి  భారీ నెగటివ్ గా మారింది .



అయితే ఫస్ట్ ఆఫ్ అయిపోయాక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఉంటుంది . ఇక ప్రభాస్ రుద్ర పాత్రలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సినిమా వేరే లెవెల్ లో గ్రాఫ్ పెంచుకుంటూ పోయింది. మరీ ముఖ్యంగా చివరి 40 నిమిషాలు.. రుద్ర పాత్రలో ప్రభాస్ ఎంట్రీ తర్వాత వచ్చిన గ్రాఫ్ వేరే లెవెల్.  ఈ సినిమా మొత్తం కూడా సెకండ్ హాఫ్ అంతే. "ఇంతకీ నీకు పెళ్లయిందా..?" అని ప్రభాస్ ని అడగడం.." నా పెళ్లి గురించి ఎందుకులే "అని బదులు ఇవ్వడం అంటే డైలాగ్స్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించాయి .



క్లైమాక్స్లో మంచు విష్ణు నటన సూపర్ . ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది అంటే మాత్రం సెకండ్ హాఫ్ అని చెప్పాలి.  సినిమాటోగ్రఫీ ..మ్యూజిక్ .. పాటలు .. లిరిక్స్ .. వి ఎఫ్ ఎక్స్ అన్ని చాలా బాగున్నాయి . రైటింగ్ బాగానే ఉన్నా ఇంకొంచెం బాగా రాసుకుంటే ఇంకా బాగుండేది అంటూ రివ్యూ ఇస్తున్నారు . మోహన్ లాల్ - మోహన్ బాబు చాలా చాలా బాగా మెప్పించారు అని ఓవర్ ఆల్ కృష్ణంరాజు కన్నప్ప అంత కాదు కానీ ఓసారి మాత్రం చూడగలిగే సినిమా అంటూ ఓవర్సీస్ నుంచి టాక్ బయటకు వచ్చింది. అయితే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ప్రభాస్ .. సినిమాకి అతి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఫస్ట్ హాఫ్ అంటూ చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో...???

మరింత సమాచారం తెలుసుకోండి: