ఎస్ .. మంచు కుటుంబానికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది .. దాదాపు 8 సంవత్సరాల తర్వాత వీరు గట్టి కం బ్యాక్ తో వచ్చారు .. మనోజ్ , విష్ణు మంచి విజయాలు కొడుతున్నారు . మనోజ్ సినిమాలు మానేసి ఏడేళ్లు అవుతుంది . హిట్‌ చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు .. అప్పుడెప్పుడో వచ్చిన శౌర్య సినిమాతో మినిమం హిట్ చూసాడు .. దాని తర్వాత మళ్లీ వరుస‌ ప్లాఫ్లే .. చివరగా 2018లో ఆపరేషన్ 2019 సినిమాల్లో స్పెషల్ గెస్ట్ గా కనిపించాడు .. కానీ దాని తర్వాత మళ్లీ ఇంకో సినిమా చేయలేదు .


ఇలా దాదాపు ఏడేళ్ల తర్వాత మొన్న బైరవం తో మే 30న వచ్చి మంచి విజయం అందుకున్నాడు .. ఇందులో మనోజ్ మెయిన్ లీడ్ కాకపోయినా .. ఆయన పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి .. అలాగే ఎన్నో ఏళ్లు తర్వాత విజయం అందుకున్నాడు .. ఇక ఇప్పుడు మరో మంచు హీరో మంచు విష్ణు , మోహన్ బాబు కూడా బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నారు .. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో వచ్చిన కన్నప్ప నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది .. అలాగే విష్ణుకు ఖచ్చితంగా హిట్ పడాలి అన్న టైంలో బ్లాక్ బస్టర్ గా మారింది కన్నప్ప .

ఇలా మంచు విష్ణు చివరిసారిగా 2016 లో వచ్చిన ఈడోరకం ఆడోరకం సినిమాతో విజయందుకున్నాడు .. దాని తర్వాత మళ్లీ హిట్ చూడలేదు .. వరుసగా సినిమాలు చేస్తున్న విజయం అనేది కరువైంది .. 2022లో చివరగా వచ్చిన జిన్నా సినిమా కూడా ప్లాఫ్ అయింది .. దాని తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన కన్నప్ప బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది .. ఇందులో మోహన్ బాబు కూడా కీలకపాత్రలో నటించాడు .. ఆయన తన నటనతో సినిమాను వినకుండి నడిపించాడు .. అలాగే అన్నీ తానై చూసుకున్నారు .. ఇక ఈ సినిమాతో మోహన్ బాబుకు విష్ణుకు సాలిడ్ హిట్ వచ్చినట్టే .. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత వీరిద్దరూ బ్లాక్ బస్టర్ అందుకున్నారు .. ఇలా మొత్తంగా అన్నదమ్ములు ఒకే ఏడాది పెద్ద విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు .. ఇలా ఈ ఏడాది మంచు ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి: