
ఈ క్రమంలో తెలుగు చిత్రాలను శ్రీలీల నిర్లక్ష్యం చేస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొన్ని నెలల క్రితం నవీన్ పోలిశెట్టి `అనగనగా ఒక రాజు` సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల.. రీసెంట్‌గా అఖిల్ అక్కినేని `లెనిన్` మూవీ టీంకు కూడా షాక్ ఇచ్చింది. డేట్స్ ఖాళీగా లేవనే కారణంతో లెనిన్ సినిమా నుంచి శ్రీలీల అవుట్ అయింది. దీనికి తోడు బాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నడంతో శ్రీలీల తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందనే వార్త తాజాగా తెరపైకి వచ్చింది.
ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల నుంచి 3.5 కోట్ల రేంజ్ లో వసూలు చేసేది. అయితే తన రాబోయే ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 7 కోట్లు డిమాండ్ చేస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీలీల తప్పు మీద తప్పు చేస్తుందని.. ఆమెకు మైండ్ దొబ్బిందని సినీ ప్రియులు అభిప్రాయపరాడుతున్నారు. ఇప్పటికే తెలుగు సినిమాలను పక్కన పెడుతుందనే కారణంతో శ్రీలీలపై టాలీవుడ్ గుర్రుగా ఉంది. ఇప్పుడు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ పెంచితే ఆమెతో సినిమా చేయడానికి ఏ టాలీవుడ్ నిర్మాత ముందుకు రాడని.. అది శ్రీలీల కెరీర్‌కు ముప్పుగా మారుతుందని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు