టాలీవుడ్ లో ఇటీవల రీ రిలీజ్ ట్రెండ్ మరింత ఊపందుకుంది. జూలై నెలలో కొత్త సినిమాల హడావుడి కన్నా రీ రిలీజ్ కాబోయే పాత చిత్రాల హంగామానే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 క్లాసిక్ హిట్ మూవీస్ ఈ నెలలో మళ్లీ థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో మొదటిగా చెప్పుకోవాల్సిన చిత్రం `ఎంఎస్ ధోని`. ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తీసిన బయోపిక్ ఇది. దివంగ‌త న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఈ చిత్రం 2016లో విడుద‌లైన భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ మూవీ జూలై 7న మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.


జూలై 10న రీరిలీజ్ కానున్న మ‌రో చిత్రం `కుమారి 21ఎఫ్`. రాజ్ త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టించిన ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్టైన‌ర్ 2015లో విడుద‌లైన సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది.  అలాగే జూలై 11న మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ `మిర‌ప‌కాయ్` చిత్రం రీరిలీజ్ కాబోతుంది.


నాగ‌చైత‌న్య‌, స‌మంత తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం `ఏ మాయ చేశావే`. 2010లో వ‌చ్చిన క్లాసిక్ హిట్ గా నిలిచిన ఈ సినిమా జూలై 18న మ‌ళ్లీ విడుద‌ల కానుంది. అదే రోజు సూర్య సూప‌ర్ హిట్ మూవీ `గ‌జిని` మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు రెడీ అయింది. జూలై 19న సూర్య‌, త‌మ‌న్నా క‌లిసి న‌టించిన `వీడొక్క‌డే` సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాల‌కు ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మ‌రి రీరిలీజ్ లో ఈ చిత్రాలు ఎటువంటి రెస్పాన్స్ ను అందుకుంటాయో చూడాలి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: