
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో గేమ్ చేంజర్ నష్టాలు 70 శాతం భర్తీ అయ్యాయని చెప్పుకొచ్చారు. కెరీర్ తొలినాళ్లలో తాము కూడా థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. నైజాంలో ఇప్పుడు పోటీ తక్కువగా ఉందని ఒకప్పుడు ఎక్కువగా ఉండేదని ఆయన కామెంట్లు చేశారు. గతంలో సినిమాలు 100 రోజులు ఆడేవని ఇప్పుడు 2 వారాలకే సినిమాలు పరిమితం అవుతున్నాయని శిరీష్ అన్నారు.
గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన సమయంలో దిల్ రాజు అయిపోయారని శిరీష్ అయిపోయారని అంటారని ఎవరైనా వచ్చి మాకు త్యాగాలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. గేమ్ చేంజర్ ఫ్లాపైంది హీరో వచ్చి మాకేమైనా హెల్ప్ చేశాడా? దర్శకుడు వచ్చి మాకేమైనా హెల్ప్ చేశాడా? కనీసం ఒక కాల్ కూడా చేయలేదని ఆయన పేర్కొన్నారు. హీరోలను రెమ్యునరేషన్ వెనక్కు అడిగే స్థాయిలో మా సంస్థ లేదని ఆయన అన్నారు.
గేమ్ చేంజర్ సినిమా ఫ్లాపయినా ఎవరినీ నిందించలేదని శిరీష్ తెలిపారు. అతి త్వరలో ఈ బ్యానర్ నుంచి తమ్ముడు సినిమా విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఖఛ్చితంగా హిట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్.వీ.సి బ్యానర్ కు భవిష్యత్తు సినిమాలు ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది. నేను ఎవరికి భయపడనని ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడతానని శిరీష్ చెప్పిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.