కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ హీరోగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య పాత్ర‌లో శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన `కుబేర‌` చిత్రం గ‌త నెల 20న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. పోటీగా క‌న్న‌ప్ప రిలీజ్ అయిన కూడా స్ట‌డీగా నిల‌బ‌డ్డ కుబేర‌.. ఫైన‌ల్ గా 16వ రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ తో బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలిచింది.


16 డేస్ థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసే స‌మ‌యానికి కుబేర మూవీ ఏపీ మ‌రియు తెలంగాణ‌లో రూ. 38.34 కోట్ల షేర్‌, రూ. 65.10 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది. అలాగే తమిళనాడులో రూ. 19.75 కోట్లు, కర్ణాటకలో రూ. 11.90 కోట్లు, కేరళలో రూ. 1.25 కోట్లు, హిందీ మ‌రియు రెస్టాఫ్ ఇండియా రూ. 2.80 కోట్లు, ఓవ‌ర్సీస్ లో రూ. 30.90 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను కుబేర సొంతం చేసుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 16 రోజుల్లో ఈ సినిమాకు రూ. 66.55 కోట్ల షేర్‌, రూ. 131.70 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.


రెండు తెలుగు రాష్ట్రాల్లో కుబేర బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 34 కోట్లు కాగా.. వ‌రల్డ్ వైడ్ టార్గెట్ రూ. 66 కోట్లు. ఇప్ప‌టివ‌ర‌కు బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ ను చూసుకుంటే ఏపీ, తెలంగాణ‌లో కుబేర చిత్రానికి రూ. 4.34 కోట్ల ప్రాఫిట్ వ‌చ్చింది. ఓవ‌రాల్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా చూసుకుంటే  రూ. 0.55 కోట్ల లాభాలు వ‌చ్చాయి. ఇక ఈ వారం విడుద‌లైన నితిన్ `త‌మ్ముడు` ఫ్లాప్ టాక్ తెచ్చుకోవ‌డంతో..  కుబేరా తిరిగి ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. సో.. సినిమా మరో వారం వరకు స్టడీగా కలెక్షన్లు నమోదు చేసే అవ‌కాశం ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: