
అదే విధంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో స్పిరిట్ సినిమా కూడా చేయబోతున్నాడు .. ఇక ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు .. ఈ సినిమాల తో పాటు సలార్ 2 , కల్కి 2 సినిమాల్లోనూ ప్రభాస్ నటించబోతున్నాడు . అలాగే సలార్ 2 , కల్కి 2 సినిమాల తో పాటు హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా కూడా చేస్తున్నాడు .. ఇలా వరుస క్రేజీ సినిమాల తో బిజీగా ఉన్న ఈ పాన్ ఇండియ హీరోకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .. ఈ వీడియో లో ప్రభాస్ మాట్లాడుతూ కొంత ఎమోషన్ కూడా అయ్యారు ..
ఇక ఆ వీడియోలో ప్రభాస్ తన మొదటి సినిమా ఈశ్వర్ గురించి చెప్పుకొచ్చారు .. నాకు ఫస్ట్ టైం కలలో నీళ్లు .. ఈశ్వర్ సినిమా పూజ కార్యక్రమం అప్పుడు నేను ఓ డైలాగ్ చెప్పా .. “ఆ ఈశ్వరుడికి మూడు కళ్లు.. ఈ ఈశ్వర్ కు మూడు గుండెలు”.. అయితే అది ఎలా చెప్పానో నాకే తెలియదు .. ఆ టెన్షన్లో ఏదో చెప్పేశా .. ఇక అప్పుడు మా నాన్న నా చెయ్యి పట్టుకుని యాస్ అన్నారు ఒక్కసారే .. అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు .. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది ..