బన్నీ అట్లీ కాంబో మూవీపై ఒకింత భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. దాదాపుగా 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దీపికా పదుకొనె ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా తాజాగా ఎన్నో ప్రశ్నలకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది. మూడు తరాలకు చెందిన నాలుగు పాత్రల్లో బన్నీ నటిస్తున్నారని సమాచారం.

ఈ సినిమాకు టైటిల్  గురించి  అధికారికంగా మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.  బాలీవుడ్ మీడియాలో ఇందుకు సంబంధించిన కథనాలు ప్రచురితమయ్యాయి.  తాత, తండ్రి, ఇద్దరు కొడుకుల పాత్రల్లో  బన్నీ ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.  ఆయా లుక్స్  లో కనిపించడానికి బన్నీ   సైతం ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది.  విభిన్నమైన లుక్స్ లో  బన్నీ అదరగొట్టనున్నారని  తెలుస్తోంది.

పునర్జన్మల కాన్సెప్ట్ తో  సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.  ఈ సినిమా కోసం  మేకర్స్  కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నారని  సమాచారం అందుతోంది.  హాలీవుడ్   ఇండస్ట్రీకి సంబంధించిన  ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ  ఈ సినిమా కోసం  పని చేస్తోందని తెలుస్తోంది.  భారీ బడ్జెట్ తో ఇంటర్నేషనల్ ప్రమాణాలతో  ఈ సినిమా  తెరకెక్కుతోందని తెలుస్తోంది.

ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ నటించనున్నారని భోగట్టా.  జాన్వీ కపూర్, మృణాల్  ఠాకూర్,  రష్మిక, భాగ్యశ్రీ   ఈ సినిమాలో కనిపించనున్నారని  సమాచారం అందుతోంది.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద  ఏ స్థాయిలో  సంచలనాలు  సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.  హాలీవుడ్ కు చెందిన అగ్ర హీరో కూడా  ఈ సినిమాలో కనిపించనున్నారని  తెలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: