పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక సినిమా హరిహర వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా గురించి దర్శకుడు ఎయం జ్యోతి కృష్ణ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ పంచుకున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర రూపొందించడానికి దిగ్గ‌జ‌ నటులు ఎన్టీఆర్ - ఎంజీఆర్ నుంచి ప్రేరణ పొందాలని జ్యోతికృష్ణ‌ వెల్లడించారు. ఎన్టీఆర్ - ఎంజీఆర్ లాంటి దిగ్గ‌జ‌ వ్యక్తులు లాగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో కూడా అద్భుతమైన లక్షణాలు గమనించిన తర్వాత ఆయన పాత్రను రాయటానికి ప్రేరణ పొందాలని జ్యోతికృష్ణ‌ తెలిపారు. ధర్మప‌రుడిగా , బలవంతుడిగా ప్రజల మనిషిగా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని హరిహర వీరమల్లు సినిమాలో ఆయన పాత్రను చాలా జాగ్రత్తగా రూపొందించినట్లు జ్యోతికృష్ణ‌ తెలిపారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంజీఆర్ సందేశాత్మక నిజాయితీతో కూడిన సినిమాలు చేస్తూ నటన జీవితాన్ని కొనసాగించాలని ఈ అంశం తనకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు.


అందుకే హరిహర వీరమల్లు సినిమాలో మాట వినాలి అనే శక్తివంతమైన పాటను స్వరపరిచామని తెలిపారు. ఈ పాఠశారాంశం పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రతిబింబిస్తూ నిజ జీవితంలో సానుకూలత ధర్మాన్ని స్వీకరించడానికి తెలియజేస్తుందని జ్యోతికృష్ణ‌ తెలిపారు. నటుడుగా ఎన్టీఆర్ గొప్ప పౌరాణిక జానపద సినిమాలు చేశారు. రాముడు .. కృష్ణుడు పాత్రలలో ఆయన ఒదిగిపోయిన తీరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎన్టీఆర్ ధర్మాన్ని నిలబెట్టే సామర్థ్యాన్ని సూచించే విల్లు - బాణం పట్టుకున్న శ్రీరాముడుగా అద్భుతంగా చిత్రీకరించబడ్డారు. దీని నుంచి ప్రారంభం వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం విల్లు - బాణాన్ని రూపొందించామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను కథానాయకుడుగా కాకుండా నాయకుడిగా చూస్తున్నారని దానికి తగినట్టుగా ఈ సినిమా కథ మార్చినట్టు జ్యోతి కృష్ణ తెలిపారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: