
అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని కొనసాగిస్తూ ఇండియన్ 2 అంటూ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్.. ఆ సమయంలోనే ఇండియన్ 3 కూడా తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. అలా ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వచ్చిన ఇండియన్ 2 సినిమా విడుదలై ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. దీంతో డైరెక్టర్ శంకర్ పైన చాలా ట్రోల్స్ కూడా వినిపించాయి. దీంతో ఇండియన్ 3 విడుదల పైన పలు రకాల అనుమానాలు కూడా మొదలయ్యాయి. వీటికి తోడు సినిమా చుట్టు ఎన్నో సమస్యలు కూడా చుట్టుముత్తాయి. అలాగే ఓటిటి లో రిలీజ్ కాబోతున్నట్లు వినిపించాయి. మరి కొన్ని సందర్భాలలో అసలు ఇండియన్ త్రీ అవసరమా అంటూ చాలామంది ట్రోల్ చేశారు.
ఇప్పుడు తాజాగా మరొకసారి తమిళ సినివర్గాలలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నట్లు వినిపిస్తున్నాయి
డైరెక్టర్ స్వయంగా ఇండియన్ 3 ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారట. ఇందులో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక పాట షూటింగ్ మిగిలి ఉందని శంకర్ తెలియజేసినట్లు వినిపిస్తున్నాయి.ఇవన్నీ పూర్తయిన తర్వాతే థియేటర్లో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేసినట్లు సమాచారం. మరి ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలుపడితేనే తప్ప ఏ విషయం అన్నది కరాకండిగా చెప్పలేకపోతున్నారు. కానీ ఇండియన్ త్రీ పైన వస్తున్న రూమర్లకు మాత్రం చెక్ పెట్టారు శంకర్.