టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటీమణులలో సమంత ఒకరు. ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన సక్సెస్ను అందుకుంది. ఆ తర్వాత కూడా అదే రేంజ్ విజయాలను అందుకుంటు చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్కి చేరుకున్న తర్వాత కూడా ఈమె ఎప్పుడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఈమె కెరియర్ను ముందుకు సాగించింది. ఈ మధ్య కాలంలో మాత్రం సమంత తన సినిమాల సంఖ్యను చాలా వరకు తగ్గించింది. కొంత కాలం క్రితమే ఈమె శుభం అనే సినిమాను నిర్మించింది. ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే పైన ఫోటోలో సమంత తో పాటు ఓ అమ్మాయి ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈమె చాలా సీరియల్స్ లలో కూడా నటించి బుల్లి తెర ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకుంది. చైల్డ్ ఆర్టిస్టుగా నటించి , సీరియల్స్ లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె కొంత కాలం ఓ సినిమాలో కూడా నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకు పైన ఫోటోలో సమంత తో పాటు ఉన్న ఆ నటి ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు సినిమాల్లో , సీరియల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రణవి మానుకొండ. ఈ నటిమని తన కెరియర్లో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 

అలాగే ఎన్నో సీరియల్స్ లలో కూడా నటించింది. కొంత కాలం క్రితం ఈమె స్లామ్ డాగ్ హస్బెండ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమాలో ఈ బ్యూటీ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఈమె చిన్న వయసులో సమంత తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: