
నిధి అగర్వాల్ మాట్లాడుతూ పంచమి పాత్ర కోసం చాలా కష్టపడ్డానని లుక్, స్టైల్, అప్పియరెన్స్ కోసం రోజుకు రెండు గంటల పాటు కష్టపడ్డానని చెప్పుకొచ్చారు. ధరించే దుస్తులు, మేకప్, యాక్ససరీస్ కోసం చాలా కష్టపడ్డానని ఆమె కామెంట్లు చేశారు. ఈ పాత్ర కొరకు శారీరకంగా చాలా కష్టపడ్డానని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. హరిహర వీరమల్లు సినిమా కోసం తాను గుర్రపు స్వారీ చేశానని ఆమె వెల్లడించారు.
ఈ సినిమాలో తాను పోరాట సన్నివేశాలు చేశానని భరతనాట్యం కూడా నేర్చుకున్నానని ఆమె అన్నారు. పంచమి పాత్ర కోసం తానూ పడిన కష్టం అంతాఇంతా కాదని నిధి అగర్వాల్ తెలిపారు. తనకు, పవన్ కు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయని ఆమె కామెంట్లు చేశారు. హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ సాధిస్తే నిధి అగర్వాల్ పేరు మారు మ్రోగిపోయే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.
హరిహర వీరమల్లు సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సినిమా రిలీజ్ కానుంది. తన పాత్రకు సంబంధించి ఊహించని ట్విస్ట్ ఉంటుందని నిధి అగర్వాల్ పేర్కొన్నారు. తాను సొంతంగా మేకప్ వేసుకుంటానని ఆమె తెలిపారు. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నిధి అగర్వాల్ కు ఈ సినిమాతో ఆ కోరిక తీరుతుందేమో చూడాలి. నిధి పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.