ఏంటి ఆర్జీవి కాపురంలో ఆ హీరోయిన్ చిచ్చు పెట్టిందా? ఆ హీరోయిన్ పెట్టిన చిచ్చు వల్లే ఆర్జీవి కాపురం కూలిపోయిందా.. ఎంతో అన్యాయంగా ఉంటే ఆర్జీవికి తన భార్యకి మధ్య గొడవలు పెట్టించిన ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మ అప్పటి జనరేషన్లోనే పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఈయన తెలుగు మాత్రమే కాకుండా హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు.అలా అమితాబ్ బచ్చన్ వంటి హీరోలతో కూడా ఈయన వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి ఆర్జీవి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలా ఉన్నారో చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఉన్న ఈయన ప్రస్తుతం బూతు సినిమాలకు అసభ్య సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. అలాగే ఈయన లేడీ యాంకర్ లతో చేసే ఇంటర్వ్యూలు కూడా ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు.

ఇక కొంతమంది ఆర్జీవి అంటే ఇష్టం ఉన్న డై హార్డ్స్ ఫ్యాన్స్ కూడా ఇదేంటి మా డైరెక్టర్ ఇలా మారిపోయారు అని అనుకుంటూ ఉంటారు.రాంగోపాల్ వర్మ భార్య పేరు రత్న.. వీరికి ఓ కూతురు కూడా ఉంది. కానీ రాంగోపాల్ వర్మని ఆయన భార్య వదిలేసి వెళ్ళిపోయింది. అలాగే ఆర్జీవి భార్య కూతుర్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా అప్పుడప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే వీరిద్దరి మధ్య ఈ గొడవలు రావడానికి కారణం బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ అట.. అవును మీరు  వినేది నిజమే.. ఎందుకంటే అప్పట్లో ఈ హీరోయిన్ కి ఆర్జీవి కి మధ్య ఎఫైర్ ఉంది అనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా ఆర్జీవి తన ప్రతి సినిమాలో ఊర్మిళా మటోండ్కర్ ని పెట్టుకోవడంతో ఈ వార్తలు ఎక్కువగా వినిపించాయి. అలాగే ఊర్మిళ కూడా రాంగోపాల్ వర్మ సినిమాలు తప్ప వేరే సినిమాలు చేయకపోయేది.
దాంతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ మొత్తం ఇండస్ట్రీ వ్యాపించి అసలు ఊర్మిలాకి అవకాశాలు ఇవ్వడమే మానేశారు. ఇక ఓ దశలో రాంగోపాల్ వర్మ ఊర్మిళా ని పక్కన పెట్టారు.దాంతో ఆ తర్వాత చాలామంది దర్శకనిర్బాతలు ఊర్మిళను పట్టించుకోలేదు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉంది అనే వార్తలు ఆర్జీవి భార్య దాక పాకడంతో ఈ విషయం తెలిసిన ఆర్జీవి భార్య రత్న చాలాసార్లు గొడవలు పెట్టుకుందట. అంతేకాదు ఓసారి ఆర్జీవి తలను గోడకేసి బాది పిచ్చ కొట్టుడు కొట్టిందట. ఇక ఈ గొడవ జరిగాక ఆర్జీవి ఊర్మిళని దూరం పెట్టారు.. వేరే సినిమాలు చేశారు. కానీ ఆర్జీవి డైరెక్షన్లోనే ఎక్కువ సినిమాలు చేసిన ఊర్మిళని బాలీవుడ్ లో ఉన్న దర్శకనిర్మాతలు పట్టించుకోలేదు. ఒకప్పుడు ఎన్నిసార్లు అడిగినా కూడా చేయలేదు. ఇప్పుడు ఆమెకు ఛాన్స్ ఇచ్చేది ఏంటి అని పక్కన పెట్టేశారు.అలా ఊర్మిళా మటోండ్కర్ కెరియర్ కూడా నాశనమైంది అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: