- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ లో ఈ ఆగస్టులో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాస్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా వార్ 2 - కూలి సినిమాల మధ్య పోటీ అని చెప్పాలి. టాలీవుడ్ యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ ... కోలీవుడ్ సూప‌ర్ స్టార్‌ రజనీకాంత్ , అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో వస్తున్న కూలి సినిమాల‌ మధ్య పోటీ మామూలుగా ఉండేలా లేదు. అందుకే సౌత్ తో పాటు నార్త్ ఇండియాలను ఈ రెండు సినిమాల మధ్య థియేటర్ల పరంగా గట్టి పోటీ ఉండనుంది. అయితే నార్త్ లో మాత్రం ఒకింత వార్ 2 సినిమా కే ఎక్కువ స్క్రీన్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే నాతో కూడా వారు 2 సినిమాకి కూలి పెద్ద పోటీ ఇస్తుందన్న అంచనాలు కనిపిస్తున్నాయి.


కూలీ ఓటీటీ డీల్‌ 8 వారాల తర్వాతే లాక్ కావడంతో కూలీ సినిమాకు హిందీ మార్కెట్లో నేషనల్ చైన్స్ ఇంకా అనేక సింగల్ స్క్రీన్స్ వారు కూడా కూలి సినిమాకి మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో హిందీలో కూడా కూలీ కి భారీ రిలీజ్ ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ రోల్ ఏ మాత్రం వర్క్ అవుట్ అయిన నార్త్ లో కూడా కూలి సినిమా నుంచి వార్ 2 సినిమాకు గట్టి పోటీ తప్పేలా లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: