పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా సినిమా  "హరిహర వీరమల్లు". ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు. భారీ చిత్రం ఏదైనా ఉంది ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యేది అని అంటే మాత్రం ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన "హరిహర వీరమల్లు" అని చెప్పొచ్చు . దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ  సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ భారీ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడింది. దీంతో సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి .


అంతేకాదు ఈ సినిమాకి ప్రమోషన్స్ చాలా స్లోగా ఉండడం ఫాన్స్ కి కూసింత డిసప్పాయింట్ చేసే విషయం . సాధారణంగా యుఎస్ మార్కెట్లో ముందు రోజే ప్రీమియర్స్ పడతాయి . కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎర్లీ షోస్ ఉంటాయి అనేటాక్ బయటకు వచ్చింది . లేటెస్ట్ గా నిర్మాత ఏ ఎం రత్నం సాలిడ్ అప్డేట్ ని అభిమానులకు అందించారు . తెలుగు రాష్ట్రాలలో కూడా మొత్తం పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాని త్వరగానే చూసి పండగ చేసుకోవచ్చు. కాగా  "కన్నప్ప" సినిమాకి మంచు విష్ణు రిలీజ్ కి 24 గంటలు ముందు సినిమాకి సంబంధించి "ఎవరైనా కావాలని నెగటివ్ వార్తలు ప్రచారం చేసిన ..నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన సినిమా గురించి తప్పుడు ప్రచారం చేసిన.. లీగల్ యాక్షన్ తీసుకుంటాము" అంటూ ఒక వార్నింగ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.



సేమ్ "హరి హర వీరమల్లుకి" కూడా అలాగే చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మూవీ మేకర్స్ అన్ని విషయాలను పక్కాగా మాట్లాడుకున్నారట . సినిమా రిలీజ్  24 గురువారం అయితే ప్రీమియర్స్ మాత్రం ముందు రోజే అంటే బుధవారం జులై 23 రాత్రి 9:30 కి స్టార్ట్ అవుతాయి. ఈ క్రమంలో జులై 22వ తేదీనే నెగిటివ్ రివ్యూస్ రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయాలి అంటూ మేకర్స్ కన్ఫర్మ్ చేసుకున్నారట.  దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా దీనికి అంగీకారం తెలిపినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: