తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో రాసి కన్నా ఒకరు. ఈమె ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోవడం , అలాగే ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుస పెట్టి సినిమా అవకాశాలు దక్కాయి. దానితో ఈమె చాలా కాలం పాటు మంచి జోష్లో కెరియర్ను ముందుకు సాగించింది. ఆఖరుగా ఈమె గోపీచంద్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన పక్కా కమర్షియల్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ కంటే ముందు కూడా ఈమె నటించిన కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయి. ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాల కంటే కూడా తమిళ్ , హిందీ సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుసు కదా అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. తాజాగా మరో తెలుగు సినిమాలో ఈమె ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఈమె తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో భాగం అయినట్లు తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్  అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో రాశి కన్నా కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్లో కూడా జాయిన్ అయినట్లు సమాచారం. రాశి ఖన్నా కు ఇది అదిరిపోయే సూపర్ సాలిడ్ ఆఫర్ అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ మూవీ మంచి విజయం అందుకున్నట్లయితే మరోసారి తెలుగు లో ఈమెకు అద్భుతమైన క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rk