- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా సినిమాల‌లో ప్రేక్షకుల ఆసక్తిని రేపుతున్న చిత్రం “ది రాజా సాబ్”. దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ హారర్, రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసుకుంది. టాలీవుడ్ లో సరికొత్త జోనర్ లో ప్రభాస్ నటిస్తున్నందుకు ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా భారీ హైప్ ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ మరింత ఆసక్తిని పెంచడంతో పాటు, సినిమా బిజినెస్ విషయంలో కూడా భారీ ఆఫర్లు వచ్చేలా చేసింది. తాజా అప్‌డేట్ ప్ర‌కారం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్, “ది రాజా సాబ్” హిందీ వెర్షన్ డిజిటల్ హక్కుల కోసం ఏకంగా రు. 100 కోట్లకు పైగా ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇది ఇప్పటి వరకు ఒకే ఒక్క భాషకు వచ్చిన అత్యధిక ఓటీటీ డీల్.


ప్రభాస్ క్రేజ్‌ను, మార్కెట్ రెంజ్‌ను చూస్తే ఈ నెంబ‌ర్లు షాకింగ్‌గా అనిపించినా ప్ర‌భాస్ పాన్ ఇండియా క్రేజ్‌, అతడి మార్కెట్ స్థాయిని బట్టి చూస్తే ఇది స‌రైన ఫిగ‌ర్‌గానే చెప్పాలి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. “ది రాజా సాబ్” చాలా ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. ప్రభాస్ ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని కామెడీ షేడ్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా మరణించిన ప్రేమికురాలి ఆత్మ చుట్టూ తిరిగే కథతో సాగుతుందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో టాక్ ఉంది. కామెడీ కింగ్ మారుతీ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, ప్రభాస్ మ్యానరిజం కూడా ఈ సినిమాకు హైలైట్ గా నిలవబోతోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ విలువలు, విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయని చిత్రబృందం చెబుతోంది. డిసెంబర్ 5, 2025 న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని యూనిట్‌ ప్లాన్ చేస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: