
అయితే ఆ తర్వాత పలు సినిమాలలో ఛాన్స్ వచ్చినా అల్లు అర్జున్ ఆమె నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే ఇప్పుడు సెకండ్ సినిమాకి ఆమె ఓకే చేసినట్లు తెలుస్తుంది. అది కూడా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కే సినిమాలోనే. ఎస్ మీ గెస్సింగ్ కరెక్ట్. అట్లీ దసకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ మూవీ తెరకెక్కుతుంది ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ చైల్డ్ క్యారెక్టర్ లో అల్లు అర్హ కనిపించబోతుందట . దీనికోసం అట్లీ స్పెషల్ గా అల్లు అర్జున్ ని రిక్వెస్ట్ చేశారట. మొదట నో అని చెప్పిన అల్లు అర్జున్ ఆ తర్వాత క్యారెక్టర్ బాగుండడంతో అల్లు అర్హ కి కూడా ఇది ఒక గుర్తుగా ఉంటుంది అన్న కారణంగా ఓకే చేశారట .
త్వరలోనే అల్లు అర్జున్ తో పాటు అల్లు అర్హ కూడా ముంబైలో ఈ సినిమా షూట్ సెట్స్ లో పాల్గొబోతుంది . ఈ క్యారెక్టర్ చాలా హై గా ఉండబోతుంది అంటూ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతున్నట్లు సినీ వర్గాలలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . చూడాలి మరి ఫస్ట్ సినిమాతో మంచి మార్కులు వేయించుకున్న అల్లు అర్హ..సెకండ్ సినిమాలో తన నటనకు ఎలాంటి మార్కులు వేయించుకుంటుందో..? అల్లు అర్హ చాలా చాలా టాలెంట్ గల అమ్మాయి. సోషల్ మీడియా ద్వారా స్నేహారెడ్డి కొన్ని సందర్భాలలో ఈ విషయాని బయటపెడుతూనే వచ్చింది. ఇప్పుడు ఏకంగా నాన్న సినిమాలో నటించే అంత పెద్దది అయిపోయింది. దీంతో అల్లు అర్హ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. వీళ్ళిద్దరిని తెరపై ఒకేసారి చూస్తే మాత్రం అల్లు ఫ్యాన్ కి ఫుల్ మిల్స్ లెక్కనే ఉంటుంది..!!