ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ నుంచే వస్తున్న తొలి చిత్రం `హరిహర వీరమల్లు`. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాత. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా హైదరాబాద్ లో సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ సింగిల్ గా కాకుండా స‌తీసమేతంగా హాజ‌రు కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.


వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా అన్నా ఒకప్పుడు పెద్దగా బయట కనిపించేవారు కాదు. పవన్ న‌టించిన సినిమా ఈవెంట్స్ లో కూడా ఆమె పాల్గొన్నది లేదు. కానీ ఎప్పుడైతే ఏపీలో జనసేన అధికారంలోకి వచ్చిందో నాటి నుంచి తన సతీమణిని రాష్ట్ర కార్యక‌లాపాల్లో పవన్ భాగం అయ్యేలా చేస్తున్నారు. ఇక తాజాగా జరిగిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సినీ ప్రముఖలే కాకుండా రాజకీయ నాయకులు కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, సినిమాటోగ్రఫీ/టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్, కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ తదితరులు ఈ ఈవెంట్లో సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా ఉంటుందని వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ వైఫ్‌ తో కలిసి వచ్చార‌ని అంటున్నారు. కచ్చితంగా అదే రీజ‌న్ అయ్యుండకపోవచ్చు కానీ.. పవన్-అన్నా కలిసి సందడి చేయడంతో ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: