
ఒకపక్క ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరొకపక్క సినిమాకి టైం కేటాయించి చకచకా సినిమా షూట్ ను కంప్లీట్ చేశారు . పక్క ప్లానింగ్ తో ముందుకు వెళ్లి ఈ సినిమాను రిలీజ్ చేశారు . నిన్న రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఈ సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. రిలీజ్ అయిన ప్రతి ఒక్క చోట పాజిటివ్ టాక్ దక్కించుకోవడం విశేషం. పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ కి హై మార్కులు పడ్డాయి . 100% పవన్ కళ్యాణ్ సినిమాలో బాగా నటించాడు అంటూ జనాలు పొగిడేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ ని కూడా ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.
నిధి అగర్వాల్ చాలా నిబద్దతో ఈ సినిమా షూట్ లో పాల్గొన్నింది. సాధారణంగా ఇలా సినిమా డిలే అయితే హీరోయిన్స్ సినిమా క్యాన్సిల్ చేసుకుని వేరే సినిమాకు కమిట్ అవుతారు . నిధి అగర్వాల్ మాత్రం పవన్ కళ్యాణ్ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమా షూట్ లేట్ అయినా కూడా ఈ సినిమాకి కట్టుబడి తన విలువైన టైమ్ ను కేటాయించింది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ఆమె పేరు కూడా హైలెట్ గా మారింది . మరీ ముఖ్యంగా "పంచమి" పాత్రలో నిధి అగర్వాల్ చక్కగా నటించి మెప్పించింది . సినిమా షూట్ లేట్ అవ్వడం వల్ల మొదటి షాట్స్ లో చాలా సన్నగా అనిపించిన.. ఆ తర్వాత కొంచెం బొద్దుగా కనిపించింది . కానీ నటన పర్ఫామెన్స్ లో మాత్రం ఎక్కడా తగ్గలేదు . అయితే నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా మేకర్స్ నయనతారను అనుకున్నారట . ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్లే అనుకున్నారు . కానీ సినిమా షూట్ ఆలస్యం కావడం వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట . ఆ తర్వాత ఈ ప్లేస్ లోకి చాలామంది హీరోయిన్స్ అనుకున్న ఫైనల్ గా నిధి అగర్వాల్ సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఆమె మంచి హిట్ తన ఖాతాలో వేసుకునింది. సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ పేరు మారుమ్రోగిపోతుంది..!!