"హరిహర వీరమల్లు" సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు ఊహించలేకపోయారు . సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకం అందరికీ ఉన్న ఈ రేంజ్ లో అభిమానులని జనాలని ఆకట్టుకుంటుంది అంటూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . దానికి మెయిన్ రీజన్ సినిమా ఆలస్యం కావడమే . ఎప్పుడో 5 ఏళ్లకు ముందే ఈ సినిమా అనౌన్స్ చేశారు . ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈ సినిమా షెడ్యూల్ కొంచెం కొంచెంగా ముందుకు వెళుతూ వచ్చింది . ఇక ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలోకి రాడు అని .. ఈ సినిమా ఆటకెక్కినట్లే అని చాలామంది ట్రోల్ చేశారు .


చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నిరుత్సాహపడిపోయారు. సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఎంతో నమ్మకంతో ఈ సినిమాను నమ్మి తనకు ఇచ్చిన మేకర్స్ నష్టాలు తెచ్చుకోకూడదు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరొక పక్క రోజూ రెండు గంటలు  సమయం కేటాయించి సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు.  మొత్తానికి సినిమా రిలీజ్ అయ్యింది . సూపర్ డూపర్ హిట్ అందుకుంది . ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హరి హర వీరమల్లు గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు.



అయితే ఇప్పుడు ఇదే కామెంట్స్ మెగాస్టార్ చిరంజీవి "విశ్వంభర" సినిమాకి సైతం పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తున్నాయి.  విశ్వంభర సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో అందరికీ తెలుసు . ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ వీ ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ కారణంగా కొంచెం కొంచెం లేట్ అవుతూ వస్తుంది . ఇప్పుడు ఈ ఆలస్యమైన సెంటిమెంటే రిపీట్ అయితే మాత్రం విశ్వంభర సినిమా కూడా హిట్ అవుతుంది అంటున్నారు మెగా అభిమానులు . పవన్ కళ్యాణ్ సినిమా ఇంత హిట్ టాక్ సంపాదించుకుంటుందని ఎవరు ఊహించలేదు . చాలా టైం గ్యాప్ తీసుకున్న సరే అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యేలా చేశాడు పవన్ కళ్యాణ్ . ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమా ప్రమోషన్స్ లో ఇలాంటి స్ట్రాటజీలను ఉపయోగిస్తే హరిహర వీరమల్లు హిట్ సెంటిమెంట్ వర్కౌట్ .. అయితే కచ్చితంగా విశ్వంభర కూడా మంచి క్రేజ్ దక్కించుకుంటుంది అంటున్నారు.  చూడాలి మరి హరిహర వీరమల్లు లానే విశ్వంభర సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంటుందో ..? లేదో..??

మరింత సమాచారం తెలుసుకోండి: