- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

నందమూరి బాలకృష్ణ తో దర్శకుడు క్రిష్ సినిమా చేయబోతున్నారని .. ఆ సినిమా ఆదిత్య 369 కు సిక్వెల్‌ కావచ్చు అన్న వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫైనల్ అయింది. ప్రస్తుతం బాలయ్య - బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత వీర సింహారెడ్డి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన మలినేని గోపీచంద్ ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా తో పాటు క్రిష్‌ సినిమా సమాంతరంగా ఉంటుందని తెలుస్తోంది. క్రిష్ గతంలో బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా చేశారు. అది బాలయ్య కెరీర్ లో వందో సినిమా.. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు - మహానాయకుడు సినిమాలు వచ్చిన అవి అంచనాలు అందుకోలేదు.


అయితే ఆ సినిమాల పరాజ‌యం వెనక రాజకీయ కారణాలే ఉన్నాయి అన్నది బాలయ్య నమ్మకం. క్రిష్ వర్క్ ఎలా ఉంటుందో బాలయ్యకు తెలుసు. అందుకే తన వందో సినిమాకు క్రిష్‌కు అవకాశం ఇచ్చాడు. తాజాగా క్రిష్‌ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా వచ్చింది. సినిమా తొలి భాగం చూసినవారు క్రిష్ వర్క్ మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య తన ప్రాజెక్టును కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే అది ఆదిత్య 369 సీక్వెల్ గా ఉంటుందా ?  లేదా సోషియో ఫాంట‌సీ సినిమా అవుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఈ సినిమాకు నిర్మాతగా క్రిష్‌ సన్నిహితుడు రాజీవ్ రెడ్డి వ్యవహరిస్తారా లేదా మరో బ్యానర్ కు ఆకాశం ఇస్తారా అన్నది కూడా చర్చలు నడుపుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు 2 - 3 బ్యానర్లు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం క్రిష్ ఘాటీ సినిమా విడుదల పనులలో ఉన్నారు. అది పూర్తయిన వెంటనే బాలయ్య సినిమా వర్క్ మీదకు వస్తారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: