టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. నాగార్జున ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోగా నటించడం కంటే కూడా ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో నటించడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ వస్తున్నాడు. నాగార్జున ఆఖరుగా నా సామి రంగ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది.

నాగార్జున ఈ సినిమా తర్వాత కుబేర అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కొంత కాలం క్రితమే  విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది. తాజాగా నాగార్జున సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన కూలీ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి. నాగార్జున అభిమానులు కూలీ సినిమాలో నాగార్జున పాత్ర అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని , ఆ పాత్ర ద్వారా నాగార్జునకు సరికొత్త ఈమేజ్ దక్కుతుంది అని ఎంతో గట్టి విశ్వాసంతో ఉన్నారు.

నాగార్జున విలన్ పాత్రలో నటించిన కూలీ సినిమా ఆగస్టు 14 వ తేదీన విడుదల కానుండగా  , నాగార్జున కొన్ని సంవత్సరాల క్రితం నటించిన రగడ సినిమా ఆగస్టు 29 వ తేదీన రీ రిలీజ్ కానుంది. ఇలా నాగార్జున నటించిన రెండు సినిమాలు దాదాపు చాలా తక్కువ గ్యాప్ లో విడుదల కానున్నాయి. దానితో నాగార్జున అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది. మరి కూలీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో , రగడ మూవీ రీ రిలీజ్ లో భాగంగా బాక్సాbఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: