అతిలోక సుందరి అందాల తార అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఒకే ఒక్క పేరు అదే దివంగత నటి  శ్రీదేవి.. అలాంటి శ్రీదేవి ప్రస్తుతం మన ముందు లేకపోయినప్పటికీ ఆమె సినిమాల రూపంలో ప్రేక్షకులలో మదుల్లో ఎప్పటికీ బతికే ఉంటుంది. అందానికి నిలువెత్తు రూపం అనిపించేలా ఉండే శ్రీదేవికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ఈమెకు కేవలం మామూలు జనాలే కాదు సినీ ఇండస్ట్రీలో కూడా దర్శక నిర్మాతలు, హీరోలు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు.అలా శ్రీదేవి అంటే పడి చచ్చిపోయే రాంగోపాల్ వర్మ లాంటి దర్శకులు కూడా ఉంటారు. అలాగే శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలి అనుకునే బోనీకపూర్ లాంటి నిర్మాతలు కూడా ఎంతోమంది ఉన్నారు కావచ్చు.. అయితే అలాంటి శ్రీదేవిని ఆమె బర్త్డే రోజే ఓ నిర్మాత టీజ్ చేశారట. 

మరి ఇంతకీ ఆ నిర్మాత ఎవరయ్యా అంటే..శ్రీదేవి భర్త బోనీ కపూరే.. అవును మీరు వినేది నిజమే.. శ్రీదేవి పెళ్లి కాకముందు శ్రీదేవి బర్త్డే రోజు నిర్మాత బోనికపూర్ ఆమెకు విష్ చేశారట.బర్త్డే రోజు ఆయన 26వ బర్త్డే  శుభాకాంక్షలు  అంటూ విష్ చేయడంతో శ్రీదేవి ఆట పట్టిస్తున్నాడని ఫీల్ అయిందట. కానీ ఆమె మరింత యంగ్ గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఆమెకు బర్త్డే విషెస్ చెప్పారట. అయితే ఈ విషయాన్ని తాజాగా శ్రీదేవి బర్త్డే కావడంతో మరోసారి ఇంస్టాగ్రామ్ వేదికగా గుర్తు చేసుకున్నారు బోనీ కపూర్.ఆయన తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో శ్రీదేవి 27వ బర్త్డేకి సంబంధించి పోస్ట్ చేస్తూ ఇది ఆమె 27వ బర్త్డే కానీ నేను మాత్రం హ్యాపీ 26త్ బర్త్డే అని విష్ చేశానంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయం పంచుకున్నారు.

అయితే ఇలా మాట్లాడానికి కారణం ఆమె మరింత యవ్వనంగా ఉంది అనే ఉద్దేశంతోనే మాట్లాడాను. కానీ శ్రీదేవి మాత్రం నన్ను తప్పుగా అర్థం చేసుకొని తనని టీజ్ చేస్తున్నానని అనుకుంది అంటూ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు బోనీ కపూర్.. ఇక  శ్రీదేవి కంటే ముందే బోనీ కపూర్ కి పెళ్లయి పిల్లలు ఉండడంతో శ్రీదేవి బోని కపూర్ కి రెండో భార్యగా వెళ్ళింది.ఇక శ్రీదేవి బోని కపూర్ లకు జాన్వీ కపూర్ ఖుషి కపూర్ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఖుషి కపూర్ ఇద్దరూ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: