
శేఖర్ కమ్ములకి లక్కీ హీరోయిన్ అంటే సాయి పల్లవి. ఆయన ఆమెతో చేసిన ఫిదా , లవ్ స్టోరీ సినిమాలు బిగ్ బ్లాక్‌బస్టర్ అవుతూ ఆయన కెరీర్‌ను మార్చేసింది. అదే విధంగా నానికి కూడా సాయి పల్లవి లక్కీ హీరోయిన్. ఎంసీఏ, శ్యామ్ సింగర్ రాయ్ సినిమాల ద్వారా మంచి హిట్స్ అందుకుంది. వీళ్ళ కాంబోలో వచ్చిన ఈ సినిమాలు జనాలని బాగా ఆకట్టుకున్నాయి. మంచి హిట్స్ వీళ్ళ కాంబోలో చేరాయి. ఇప్పుడు ఈ క్రేజీ నెంబర్ మళ్లీ రిపీట్ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
న్యాచురల్ స్టార్ నాని – సాయి పల్లవి – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో కొత్త సినిమా రానుందనే వార్త ఫిలింనగర్‌లో గుసగుసలాడుతోంది. సాయి పల్లవి ఎప్పుడూ మంచి కథలనే ఎంచుకుంటుందని అందరికీ తెలుసు. ఈసారి కూడా కథ నచ్చి ఓకే చెప్పిందని తెలిసిన వెంటనే, ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇక చూడాలి మరి, ఈ సినిమా ఎప్పుడు ఆఫీషియల్‌గా అనౌన్స్ అవుతుందో..? దీంతో సోషల్ మీడియాలో వీళ్ల ముగ్గుర్ల పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయ్..!