
ముఖ్యంగా, ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడంలో అభిమానులు ఆసక్తి చూపుతారు. ఇలాంటి సందర్భాల్లో చిరంజీవికి సంబంధించిన ఒక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను మెప్పించారు. అయితే, ప్రతి నటుడికి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. అలాంటి పాత్రలో నటించాలనే కోరిక చిరంజీవికీ ఉంది. ఓ ఇంటర్వ్యూలో ఆయన తన డ్రీమ్ రోల్ ఏంటో బయటపెట్టారు. చిరంజీవి డ్రీమ్ రోల్ అంటే "భగవాన్ శ్రీకృష్ణుడి పాత్ర" అని చెప్పారు.
చిన్నప్పటి నుంచి మహాభారతం, పురాణాల కథలపై చిరంజీవికి చాలా ఆసక్తి ఉండేదట. అందుకే చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుడి పాత్రలో మెరవాలి అనే కోరిక ఆయనలో ఉండేది. అయన చిన్నప్పుడు హీరో అవుతాడని అనుకోలేదు కానీ, శ్రీకృష్ణుడిలా రెడీ చేయమని తన అమ్మను బాగా ఇబ్బంది పెట్టేవాడట. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు . "ఒక సినిమాలో కానీ, సిరీస్‌లో కానీ, కనీసం కొద్దిసేపైనా శ్రీకృష్ణుడి పాత్రలో నటించాలి అని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. కానీ అది నాకు కుదరలేదు. శ్రీకృష్ణుడిలోని లావణ్యం, మాయాజాలం, ధర్మబోధ.. ఇవన్నీ నాకు చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చారు. దీంతో చిరంజీవి డ్రీమ్ రోల్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.