ఒక కొత్త సినిమా వచ్చిందంటే చాలు అందులో తెలియని ఆర్టిస్టులు ఎవరైనా నటించి వైరల్ అయితే ఇంతకీ వీళ్ళు ఎవరు.. వీరి బ్యాగ్రౌండ్ ఏంటి అని తెలుసుకునే పనిలో పడతారు సినిమా చూసిన జనాలు.అలా తాజాగా విడుదలైన మిరాయ్ మూవీలోని ఓ నటుడి గురించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.మరి ఇంతకీ ఆ నటుడు ఎవరయ్యా అంటే.. మిరాయ్ మూవీలో శ్రీరాముడి పాత్రలో కనిపించిన నటుడు.. అయితే శ్రీరాముడి పాత్రలో ఈయన స్క్రీన్ మీద కనిపించగానే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి గూజ్ బంప్స్ వచ్చాయి.

అంతేకాదు ఆయన ఎంట్రీ తో జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. అనే నినాదాలతో థియేటర్లు మొత్తం హోరెత్తించారు. అయితే అలాంటి శ్రీరాముడి పాత్రలో నటించింది ఎవరు..ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఆయన్ని చూడలేదే అనుకుంటున్నారు చాలామంది.అయితే మిరాయ్ మూవీలో శ్రీరాముడి పాత్రలో నటించింది ఎవరో కాదు నార్త్ నటుడు గౌరవ్ బోరా. ఈయన సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఐదు సంవత్సరాలు యాక్టింగ్ నేర్చుకొని హిందీ సీరియల్స్,షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఆక్వా గార్డ్, బజాజ్ ఫ్రీడమ్, సపోలా ఆయిల్, టీవీఎస్ ఐ క్యూబ్, టాటా క్యాపిటల్ వంటి ప్రకటనల్లో కూడా నటించారు.

అలా సీరియల్స్,షార్ట్ ఫిలిమ్స్, ప్రకటనల ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గౌరవ్ బోరా చివరికి మిరాయ్ మూవీలో శ్రీరాముడు పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు.అలా మిరాయ్ మూవీతో ఈయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.ఇక మిరాయ్ మూవీ ద్వారా గుర్తింపు రావడంతో తెలుగు ఇండస్ట్రీలో గౌరవ్ బోరా కి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అంటూ ఈయన యాక్టింగ్ చూసిన పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.మరి చూడాలి మిరాయ్ మూవీ గౌరవ్ బోరా కి ఇండస్ట్రీలో ఎన్ని అవకాశాలు తెచ్చి పెడుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: