మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బాబి కొల్లి తరసకత్వంలో వాల్టేరు వీరయ్య అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి కి అద్భుతమైన విజయాన్ని అందించిన బాబి మరోసారి చిరంజీవి హీరోగా ఓ సినిమాను చేయబోతున్నాడు.

గత కొంత కాలంగా చిరంజీవి తో ఈ సారి బాబీ రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ కాకుండా అత్యంత కొత్త దనంతో ఉండే సబ్జెక్టుతో మూవీ చేయబోతున్నట్లు , గతంలో చిరంజీవి ఇలాంటి జోనర్ సినిమాలో కూడా నటించలేదు అనే వార్తలు బయటకు వచ్చాయి. దానితో ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందా ..? ఎప్పుడు ఈ మూవీ షూటింగ్ను మొదలు పెడతారా ..? ఇప్పుడు ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందా ..? అని మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి కి జోడిగా అనుష్క శెట్టి హీరోయిన్గా నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇలా ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా అనుష్క నటించబోతుంది అనే వార్తలు రావడంతో ఈ సినిమా కూడా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గానే ముందుకు వెళుతుందా ..? కొత్త దనం ఏమీ ఉండదా ..? అని ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చిరంజీవి , బాబి కాంబో లో సరికొత్త జోనర్ మూవీ రావాలి అని చాలా మంది మెగా ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి వీరిద్దరి కాంబోలో రాబోయే నెక్స్ట్ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: