మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది. రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా కొన్ని సంవత్సరాల క్రితం ధమాకా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో రవితేజ , శ్రీ లీల జంటకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. దానితో వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన నైజం ఏరియా థియేటర్ హక్కులను తాజాగా అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

దిల్ రాజు ఈ మూవీ నైజాం ఏరియా థియేటర్ హక్కులను దక్కించుకున్నాడు అనే వార్త బయటకు రావడంతో రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర సినిమాను దిల్ రాజు నైజాం ఏరియాలో పెద్ద ఎత్తున విడుదల చేస్తాడు అని , ఈ మూవీ కి గనుక మంచి టాక్ వచ్చినట్లయితే నైజాం ఏరియా నుండి సూపర్ కలెక్షన్లు కూడా ఈ మూవీ కి దక్కుతాయి అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt