స్టార్ హీరోల గురించి ఏ వార్తైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో “స్టార్స్” అని చెప్పగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే పేర్లు —చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.ఇప్పుడైతే చాలా మంది కొత్త హీరోల పేర్లు వినిపిస్తున్నా, ఒకప్పుడు టాలీవుడ్ అంటే ఈ నలుగురి గురించే మాట్లాడుకునే వాళ్లు. టాలీవుడ్‌కి నిజంగా నాలుగు పిల్లర్లుగా నిలిచిన వీళ్లు తమ కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు అందించారు.. కొన్నింటి వల్ల ఫ్లాప్స్ కూడా చూశారు. అయితే ఇప్పుడు వీరి 50వ సినిమాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం — అవి ఏవి, ఎలా నిలిచాయో చూద్దాం.


మెగాస్టార్ చిరంజీవి :

తనదైన స్టైల్‌తో ఇండస్ట్రీలో “మెగాస్టార్”గా గుర్తింపు సంపాదించిన చిరంజీవి కెరీర్‌లో 50వ సినిమాగా వచ్చిన చిత్రం ‘ప్రేమ పిచ్చోళ్ళు’.ఈ సినిమా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కి 1983లో విడుదలైంది. అయితే ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది.
చిరంజీవి చేసిన యాభై సినిమాలలో నాలుగు గెస్ట్‌ రోల్స్‌ కూడా ఉన్నాయి. వాటిని తీసేస్తే ఆయన 50వ సినిమా ‘శివుడు శివుడు శివుడు’ అవుతుంది. ఇదీ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం. కానీ ఇది కూడా పెద్దగా ఆడలేదు.



నందమూరి బాలకృష్ణ:

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య కెరీర్‌లో 50వ సినిమాగా వచ్చినది ‘నారి నారి నడుమ మురారి’.ఈ సినిమా కూడా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రం విడుదలైన వెంటనే సూపర్ డూపర్ హిట్ అయి బాలయ్య కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఇప్పటికి ఈ సినిమా బాలయ్య కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్.



కింగ్ నాగార్జున:

టాలీవుడ్‌లో “కింగ్”, “మన్మధుడు” అని పిలిపించుకున్న నాగార్జున కెరీర్‌లో 50వ సినిమాగా వచ్చినది ‘ఆకాశ వీధిలో" . ఈ సినిమాకు సంగీతంశ్రీనివాసరావు దర్శకత్వం వహించగా, రవీనా టండన్ హీరోయిన్‌గా నటించింది.2001లో విడుదలైన ఈ సినిమా ఆడియోతో పాటు సినిమాగా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆయన హింది సినిమాలు కూడా చేశారు. అలా అన్ని తీసేస్తే నాగ్ 50 వ సినిమా  ‘సీతారామరాజు’ అవుతుంది.  ఈ సినిమా ని వై వీ ఎస్ చౌదరి తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది



విక్టరీ వెంకటేష్:

వెంకటేష్ కెరీర్‌లో 50వ సినిమాగా వచ్చినది ‘నువ్వు నాకు నచ్చావ్’. విజయభాస్కర్ దర్శకత్వంలో, ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాశారు. 2001లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయి వెంకీ కెరీర్‌ను మరో మెట్టు ఎక్కేలా చేసింది. అయితే ఆయన హిందీ సినిమా ‘జెమినీ’ గెస్ట్ రోల్ పక్కన పెడితే, టాలీవుడ్ లెక్కలో ఈ మూవీనే ఆయన 50వ సినిమా అవుతుంది.



మొత్తం చెప్పాలంటే

చిరంజీవి 50వ సినిమా — ఫ్లాప్,
బాలయ్య 50వ సినిమా — సూపర్ హిట్,
నాగార్జున 50వ సినిమా — సగటు / ఫ్లాప్,
వెంకటేష్ 50వ సినిమా — బ్లాక్‌బస్టర్.

టాలీవుడ్‌కి పునాది వేసిన ఈ నలుగురు హీరోల కెరీర్‌లో 50వ సినిమా ఒక్కో రకంగా నిలిచింది — ఎవరికో ఫ్లాప్, ఎవరికో హిట్ — కానీ ప్రతి ఒక్కరి ప్రయాణం మాత్రం ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: