సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ వరకు మాత్రమే చూపిస్తూ ఉంటారు. అలాగే హీరోలు హీరోయిన్లను కాపాడే రక్షకుడి లాగా హైలెట్ చేసి చూపిస్తారు. ఇది సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటినుండి జరుగుతున్న తంతే.. హీరోయిన్ అంటే గ్లామర్ చూపించాలి.. హీరో అంటే అందరినీ కాపాడి సింహంలా కనిపించాలి. ఇదే ఎప్పటినుండో మనం సినిమాల్లో చూస్తున్న స్టోరీలు. ఇక హీరోయిన్లను కేవలం గ్లామర్ పాత్రల వరకే చూపించడం పట్ల ఇప్పటికే ఎంతోమంది సీనియర్ నటిమణులతో పాటు ఇప్పటి జనరేషన్ హీరోయిన్లు కూడా మండిపడుతూ ఉంటారు. హీరోయిన్లను అలాంటి పాత్రలకే పరిమితం చేయడం ఏంటి..కాస్త స్కోప్ ఉండే పాత్రలు ఇస్తే బాగుంటుంది కదా అని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలే చేసింది ఈ హీరోయిన్ కూడా..తాజాగా రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.హీరోయిన్లు అంటే కుక్కలాగా హీరోల చుట్టూ తిరగడం వరకే పరిమితం చేస్తున్నారు అంటూ ఫైర్ అయింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పట్ల చాలా వివక్షను కలిగి ఉన్నారు.సినిమా స్టోరీలో హీరోయిన్లకు ఎలాంటి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు. ఎప్పుడు హీరోలను హైలెట్ చేయడం కోసమే చూస్తారు. అంతేకాదు కొన్ని కొన్ని సినిమాలు చూస్తే మాత్రం ఆ సినిమాలు కేవలం హీరోల కోసమే చేస్తున్నారేమో అనిపిస్తుంది. హీరోయిన్ అంటే గ్లామర్ గా కనబడాలి.. ఎప్పుడూ హీరో వెనకాలే కాపాడండి కాపాడండి అంటూ తిరగాలి. హీరోయిన్లు హీరో వెనకాలే ఉంటారు తప్ప ముందు ఉండరు. అందాన్ని చూపిస్తూ ఎక్స్పోజింగ్ చేయాలి.హీరోయిన్ల పని అంతే. ఏ కొంచెం స్కోప్ ఉన్న పాత్ర కూడా హీరోయిన్లకు ఇవ్వరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నటి రాధిక ఆప్టే. ఇక ఆమె చేసిన వ్యాఖ్యలు హీరోయిన్లు కుక్కలా ఎప్పుడు హీరో వెనకాలే తిరగాలి అన్నట్లుగా ఉన్నాయి.

 ఇక రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ సినిమా చూసినా కూడా హీరోయిన్లకు అంత స్కోప్ అయితే ఉండదు. హీరోలనే ఎక్కువ హైలైట్ చేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది డైరెక్టర్లు  హీరోయిన్లకు కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇస్తున్నారు. కానీ ఎక్కువ శాతం మంది డైరెక్టర్లు మాత్రం హీరోలనే ఎక్కువ హైలెట్ చేస్తారు. ఇక ఇలా హీరో హీరోయిన్ వివక్ష గురించి రాధిక ఆప్టే ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో మండిపడింది.హీరోయిన్లకు కూడా మంచి పాత్రలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక రాధిక ఆప్టే తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు చేస్తుంది. అందుకే తాను నటించే సినిమాలు బోల్డ్ గా ఉన్నా సరే తనకి స్కోప్ ఉండాలి అని చూసుకుంటుంది. ఇక రాధిక ఆప్టే తెలుగులో లెజెండ్, రక్త చరిత్ర 2, ధోని, కబాలి, లయన్ వంటి సినిమాల్లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: