కానీ ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో రమ్య ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అయితే హౌస్ నుంచి బయటికి రాగానే తాను ఎలిమినేట్ అయినందుకు నిరాశపడుతున్నావా ?అంటూ నాగార్జున అడగగా.. రమ్య మాత్రం తాను ప్రతివారం కూడా నామినేషన్ లో ఉంటానని ఫిక్స్ అయ్యే మరి హౌస్ లోకి వచ్చానని తెలిపింది. కానీ ఇంత త్వరగా వెళ్తాను అనుకోలేదని తెలిపింది. హౌస్ లో ఆట తీరు సరిగ్గా లేని వారి ఫోటోలను చెత్తబుట్టలో వేసి మరి అందుకు గల కారణాలు చెప్పమని హొస్ట్ (నాగార్జున) సూచించగా.. కొంతమంది గురించి ఇలా మాట్లాడింది.
దివ్య: మొదటి నుంచి భరణితో ఉండేవారు, కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ప్రతిదానికి కోపంగా ఉంటుంది అది కంట్రోల్ చేసుకుంటే మంచిది.
పవన్: గేమ్ ఆడితే బెటర్, ఎమోషనల్ గా వెళ్ళవద్దని సలహా ఇచ్చింది.
తనూజ: తనకి ఏ విషయం పూర్తిగా తెలియదు, ఎవరు ఏం చెప్పినా కూడా అదే నిజమనుకొని మాట్లాడేస్తుంది అందుకేనేమో తనని కూడా అపార్థం చేస్తుందని వెల్లడించింది.
కళ్యాణ్: తనకి ఇంకా మెచ్యూరిటీ లేదు నిబ్బానిబ్బాలాగానే ప్రవర్తిస్తారని, తనకి ఏం మాట్లాడాలో తెలియదని తెలిపింది.
గౌరవ్: రాక్షసుడు లాంటి వారు, చెప్పిన మాటలు అసలు వినరు, తనదే ఫైనల్ అనుకుంటారు ఈగో ఎక్కువ అంటూ తెలిపింది..
నాగార్జున చివరిగా బాంబు వేసే అవకాశం రమ్యకు ఇవ్వగా తాను చేస్తున్న వాష్ రూమ్ క్లీనింగ్ పనిని రీతూ చౌదరికి అప్పగిస్తే బిగ్ బాంబు పేల్చింది రమ్య.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి