నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో సతీష్ కిలారు నిర్మిస్తున్న పీరియాడిక్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చింది. వాస్త‌వానికి ఈ సినిమా లో న‌టించే హీరోయిన్ పేరును రివీల్ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం 12.01 గంట‌ల‌కు ఈ సినిమాలో బాల‌య్య ప‌క్క‌న న‌టించే హీరోయిన్ పేరు అధికారికంగా వెల్ల‌డి కావాల్సి ఉంది. అయితే ఈ అప్ డేట్‌ను వాయిదా వేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యం తీసుకున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం చేవెళ్ల‌లో జ‌రిగిన రోడ్ యాక్సిడెంట్. ఈ రోజు మ‌ధ్యాహ్నం జ‌ర‌గాల్సిన ఈ ప్ర‌క‌ట‌న వాయిదా వేస్తున్నామ‌ని మేక‌ర్స్ తెలిపారు. బాధిత కుటుంబాల‌కు చిత్ర యూనిట్ త‌ర‌పున ప్ర‌గాడ సానుభూతిని తెలియ‌జేసింది.


సినిమా లో న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తుంద‌న్న పుకార్లు అయితే ఉన్నాయి. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమాలో కొంత హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ వుంటుందని, బాలకృష్ణ మహరాజుగా కనిపిస్తాడ‌ని లీకులు వ‌స్తున్నాయి. గ‌తంలో గోపీచంద్ మ‌లినేని - బాల‌య్య కాంబోలో వ‌చ్చిన వీర‌సింహారెడ్డి సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ సినిమాపై కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి.


దర్శకుడు గోపీచంద్ మలినేని రాజస్థాన్ లో కోటల రెక్కీ లో ఉన్నార‌ట‌. ఈ ప్రాజెక్టు పై గోపీచంద్ కొద్ది రోజుల క్రితం స్పందిస్తూ ‘‘ గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ ఈజ్‌ బ్యాక్ .. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉంటుంద‌ని.. బాల‌య్య‌తో క‌లిసి మ‌రోసారి వ‌ర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఇది చ‌రిత్ర‌లో నిలిచిపోయే ప్రాజెక్టు అవుతుంద‌ని తెలిపారు. బాల‌య్య కెరీర్‌లో 111వ సినిమాగా ఇది తెర‌కెక్కుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: