స్టార్ హీరో సినిమా వస్తుందంటే దానికి కావాల్సిన హడావిడి హంగామా అదో రకంగా చేస్తారు. ఫ్యాన్స్ అందరిని అలర్ట్ చేసి సినిమాలో ఉన్న స్పెషాలిటీస్ అన్ని పార్ట్ పార్ట్ గా చూపిస్తూ సినిమా చూసేముందే ఆడియెన్స్ కి ఆశ రాజేసి మొదటిరోజే సినిమా చూడాలి అనే విధంగా మైండ్ సెట్ చేసుకునేలా చేస్తారు. ప్రస్తుతం ఆడుతున్న సినిమాల్ ఎలా ఉన్నా ఏదైనా స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే ఆ కిక్కే వరు ఆ హంగామానే వేరు.


అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పరిశ్రమ అంతా ఒక్క తాటిమీద నడిచే సందర్భం కనబడుతుంది. బాహుబలి సినిమా గురించి శ్రీమంతుడు సినిమా నెల పాటు పోస్ట్ పోన్ చేసుకుని తన మంచి తనాన్ని చాటుకున్నాడు మహేష్ బాబు. బాహుబలి సినిమా ఓ అద్భుతమైన ఎఫర్ట్ మరి అలాంటి సినిమాకు ఏ సినిమా ఎదురొచ్చినా కలిగే నష్టం మాటల్లో చెప్పలేనిది. అయితే ప్రస్తుతం రుద్రమదేవికి కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. నిన్న రిలీజ్ అయిన రుద్రమదేవి మంచి టాక్ తో ముందుకు దూసుకేల్తుంది. అయితే ఈ నెల 16న రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా వస్తుండంటంతో రుద్రమదేవికి బాగా దెబ్బ పడే ఛాన్స్ ఉంది.


అందుకే మెగాస్టార్ చిరంజీవికి తమ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా తమ విన్నపాన్ని తెలియచేస్తూ ఓ లెటర్ రాశాడు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. గుణశేఖర్ ఎంతో ప్రయాసతో దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో రుద్రమదేవిని చిత్రీకరించాడని ఈ సినిమాకు పోటీగా చరణ్ బ్రూస్ లీ సినిమా రావడం ఏమాత్రం మంచిది కాదని. అందుకే బ్రూస్ లీ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా కోరుతూ లెటర్ రాశాడు.


అయితే పరిశ్రమ పచ్చగా ఉండాలంటే ఒకరికి ఒకరు పోటీ రాకూడదు. అయితే ఎప్పటినుండో రిలీజ్ జాప్యం చేస్తూ చివరకు నిన్న రిలీజ్ అయ్యింది రుద్రమదేవి కాని బ్రూస్ లీ సినిమా ముందునుండి 16న రిలీజ్ అని ఎనౌన్స్ చేస్తూ వచ్చారు. అయితే నిజంగా పరిశ్రమ శ్రేయస్సు కోరుకుంటే మెగా హీరో తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాలి అయితే అది కుదిరేలా లేదు. అయితే దానయ్య మాత్రం ఈ విషయంలో తనకేం సంబధం లేదు అంతా మెగాస్టారే అంటూ సైడయిపోయాడు.


మరి తుమ్మలపల్లి రామసత్యనారాయణ రాసిన ఈ లెటర్ ప్రభావం ఎంతవరకు చూపుతుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం బ్రూస్ లీ పోస్ట్ పోన్ కు సంబంధించిన ఎటువంటి బ్రేకింగ్ న్యూస్ రాలేదు. అయితే ఒకవేళ బ్రూస్ లీ పోస్ట్ పోన్ అయినా ఇదే నెల 21న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: