చిరంజీవి 151వ సినిమాగా నిర్మింపబడుతున్న ‘సైరా’ మూవీ చిరంజీవి పుట్టినరోజునాడు ప్రారంభం అయినా ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇంకా ప్రారంభం అవ్వకపోవడానికి ఇప్పటికే అనేక గాసిప్పుల వార్తలు ఈవిషయం పై హడావిడి చేస్తూనే ఉన్నాయి. వాస్తవానికి ఈసినిమా షూటింగ్ ఆలస్యం కావడం వెనుక కొన్ని ఇగో సమస్యలు ఉన్నాయి అంటూ ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు హడావిడి చేస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ సమకూర్చిన ఈ సినిమా విషయంలో కొన్ని క్రియేటివ్ అభ్యంతరాలు దర్శకుడు సురేంద్రరెడ్డి వ్యక్తపరిచాడు అన్న వార్తలు ఉన్నాయి. దీనితో చిరంజీవితో సన్నిహితంగా ఉండే ఒకనాటి సినిమాల ప్రముఖ రచయిత సత్యానంద్ మరో ఇద్దరు రచయితలతో చిరంజీవి ఒక క్రియేటివ్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు టాక్.

ఈ రచయితల టీమ్ ఈసినిమా స్క్రిప్ట్ విషయంలో చేసిన మార్పులు చేర్పులు మరింత గందరగోళానికి తావు ఇవ్వడంతో ఈ సినిమాకు పనిచేస్తున్న రచయితల టీమ్ లో తీవ్ర క్రియేటివ్ గందరగోళం ఏర్పడింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలను తెలుసుకున్న చిరంజీవి ఈసినిమాకు పనిచేస్తున్న రచయితలు అందరినీ తన వద్దకు పిలిపించి వారి అభ్యంతరాలు తెలుసుకోవడమే కాకుండా వారందరూ కలిసికట్టుగా కూర్చుని ఒక పదిరోజులు లోపుగా ఈసినిమా స్క్రిప్ట్ కు ఒక ఫైనల్ షేప్ తీసుకురమ్మని గట్టిగా చెప్పినట్లు టాక్.

దీనికితోడు ఈసినిమాకు సినిమాటోగ్రాఫీ చేయబోతున్న రత్నవేలు ‘రంగంస్థలం’ మూవీ బాధ్యతల నుండి డిసెంబర్ నెల నుండి ఫ్రీ అవుతాడు కాబట్టి ఎట్టి పరిస్తుతులలోను ఈమూవీని డిసెంబర్ లో మొదలుపెట్టాలి అన్న పట్టుదలతో మెగా స్టార్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ‘సైరా’ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: