మిల్కీ బ్యూటీ తమన్నాకు ‘బాహుబలి’ సూపర్ సక్సస్ ఏమాత్రం కలిసిరాకపోవడంతో పాటు గత ఏడాది ఆమె తెలుగులో నటించిన సినిమాలు అన్ని ఫెయిల్ అవడంతో ఆమె మార్కెట్ ఘోరంగా పడిపోయింది. దీనికితోడు యంగ్ హీరోయిన్స్ పోటీ కూడ ఎక్కువ అయిపోవడంతో ఇక లాభంలేదు అనుకుని ప్రస్తుతం ఆమె అవకాశాల కోసం హీరోలను నిర్మాతలను మొహమాటం లేకుండా అడిగేస్తోంది అని వార్తలు వస్తున్నాయి.
Tamannah and Mehreen Pirzada join Venkatesh and Varun Tej for the photoshoot of their upcoming film F2: Fun and Frustration - watch video
ప్రస్తుతం తమన్నా ‘ఎఫ్ 2’ ప్రమోషన్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా జరిగిన ఈసినిమాకు సంబంధించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్ ను ఆకాశానికి ఎత్తేస్తూ వెంకీని ‘స్వీటెస్ట్ డార్లింగ్’ అంటూ పొగడ్తలు కురిపించి వెంకటేష్ కు షాక్ ఇచ్చింది. అంతేకాదు తాను వరుణ్ తేజ్ నుంచి చాలా నేర్చుకున్నట్లు చెబుతూ అతనితో వర్క్ చేయాలని ఉందని నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోమని డైరెక్ట్ గా అడిగి అందరికే షాక్ ఇచ్చింది. 

అదేవిధంగా  నిర్మాత దిల్ రాజ్ పై కూడా తియ్యని మాటలతో అతడిని ప్రశన్నం చేసుకోవడానికి ప్రయత్నించింది. ముఖ్యంగా దిల్ రాజ్ వైపు చూస్తూ ‘ఎఫ్ 3’ కి ప్లాన్ చేయండి నేను ఇప్పుడే డేట్స్ ఇస్తాను అంటూ దిల్ రాజ్ ను కన్ఫ్యూజ్ చేసింది. దీనితో ఆమీడియా సమావేశానికి వచ్చిన వారు తమన్నాకు బుకింగ్స్ లేవని డైరెక్ట్ గానే ఒప్పుకుంటోందా అంటూ ఆశ్చర్య పోయినట్లు టాక్.  

అయితే అనూహ్యంగా ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలలో ఉన్నంతలో ‘ఎఫ్ 2’ కి పాజిటివ్ టాక్ రావడంతో ఈసినిమా ఈసంక్రాంతి రేసు విజేతగా మారే ఆస్కారం ఉంది. దీనితో తమన్నాకు ఈ సంవత్సరం ప్రారంభంలోనే సక్సస్ వచ్చింది అనుకోవాలి. ఆమె బాలీవుడ్ మూవీ ‘క్వీన్’ రీమేక్ గా తెలుగులో ‘మహాలక్ష్మి’ పేరుతో సినిమాలో నటిస్తున్న నేపధ్యంలో తమన్నాకు వచ్చిన ఈ సక్సస్ తో ఆమెకు మళ్ళీ మార్కెట్ ఏర్పడే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: