రచయితగా మొదలు పెట్టి తరువాత దర్శకుడిగా మారి చివరకు నటుడిగా మారిపోయిన పోసాని కృష్ణమురళీ అనుష్క బన్నీల పై కామెంట్లు విసిరాడు. ఈమధ్య మీడియాకు యిచ్చిన ఇంటర్వ్యూలో షూటింగ్ స్పాట్ లో తాను నటిస్తున్న సీన్స్ చూసి తేగనవ్వుకున్న అనుష్క బన్నీల వ్యవహారానికి సంబంధించి ఒక ఆశక్తి కర విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు పోసాని. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన ‘వేదం’ సినిమాలో తాను అనుష్క అల్లుఅర్జున్ లతో కలిపి కొన్ని సన్నీ వేషాలలో నటిస్తున్నప్పుడు తన వంక అదోరకంగా చూస్తూ అనుష్క నవ్వుతూ ఉంటె ఆ నవ్వులకు బన్నీ శృతి కలిపే వాడని అప్పటివరకు దర్శకుడిగా పరాజయాలు పొందిన తాను సినిమాలలో నటిస్తున్నందుకు ఎగతాళిగా నవ్వుతున్నారా? లేదంటే నిజంగా తన నటన నచ్చి నవ్వుతున్నారా తెలియక ‘వేదం’ షూటింగ్ సమయంలో చాల వేదన అనుభవించానని చెప్పాడు పోసాని.  ఇక ‘వేదం’ షూటింగ్ సమయంలో ఆ టెన్షన్ భరించలేక తాను అల్లుఅర్జున్ వద్దకు వెళ్లి ఎందుకు నవ్వుతున్నారో నిజం చెప్పమని అడిగితే తాను దర్శకుడిగా కన్నా నటుడిగా పనికి వస్తాను అని కామెంట్ చేసిన అలనాటి బన్నీ మాటలు నేడు నిజం అయి ప్రస్తుతం తాను నటుడిగా తాను నిలదొక్కుకున్నా ‘వేదం’ షూటింగ్ సమయంలో తన పై నవ్వుతూ సెటైర్లు వేసుకున్న బన్నీ, అనుస్కల నవ్వులు మాత్రం ఇప్పటికీ పజిల్ గానే మిగిలిపోయాయి అని కామెంట్ చేసాడు పోసాని. బహుశా అప్పటి తన అనిశ్చిత పరిస్థితి అనుష్క, బన్నీల నవ్వులలో తనకు వేరే అర్దాన్ని కలిగించినా ఇప్పటికీ అలనాటి అనుష్క, బన్నీల నవ్వుల విషయంలో తనకు క్లారిటీ లేదు అని కామెంట్ చేసాడు పోసాని.   

మరింత సమాచారం తెలుసుకోండి: