పవన్ ఇమేజ్ ని ఇప్పటికే ఎంతో మంది యంగ్ హీరోలు వాడుకున్నారు. టాప్ యంగ్ హీరోలు కూడా పవన్ కళ్యాణ్ సినిమాల డైలాగ్స్ ప్రస్తావన తమ సినిమాలలో పెట్టుకుంటూ ఎదో విధంగా సక్సస్ పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పవన్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడిగా పిలిపించుకునే నితిన్ విషయం చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ లిస్టులో త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మరో యంగ్ హీరో చేరిపోతున్నాడు.

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ హీరోగా త్వరలో విడుదల కాబోతున్న మొట్టమొదటి సినిమాకు ‘ప్రేమంటే సులువుకాదురా’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ గా పేరుపొందిన ‘ఖుషీ’ సినిమాలోని పాటలోని పల్లవిని ఈ సినిమాకు టైటిల్ గా చేసుకున్నారు. ఇప్పటికీ ఈ పాట బుల్లితెర పై వస్తున్నప్పుడు అనేక మంది ఈ పాటను ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

చంద్ర గోవర్ధన రెడ్డి అనే నూతన దర్శకుడు తీస్తున్న ఈ సినిమాలో కోటి కుమారుడు రాజీవ్ తో పాటు నిమ్మీ దాస్ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. ఇంజనీరింగ్ చదువుకుంటున్న ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ ను ప్రేమించే ప్రేమ కథ ఇది.ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

సంగీత దర్శకుడిగా ఎన్నో విజయాలను అందుకున్న కోటి తన కుమారులలో ఒక కొడుకును సంగీత దర్శకుడిగా మరొక కొడుకును హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ తన వారసత్వాన్ని కొసాగించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతో మందికి అదృష్టాన్ని కలగచేసిన పవన్ కోటి కొడుకుకు కూడా కలిసి వస్తే టాలీవుడ్ లో పవన్ సెంటిమెంట్ మరింత బలపడి పోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: