ప్రపంచ దేశాల్లో ఎక్కడలేని అద్భుతాలు కొన్ని అప్పుడప్పుడు చైనాలో కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి అబ్బురపరిచే విషయాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. మరి ముఖ్యంగా అందరిని ఆశ్చర్యపరిచే రహదారిలకు చైనాలో కొదవలేదు. ప్రపంచంలో ఎక్కడా లేననంత విచిత్రంగా చైనాలోని రహదారులు ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక రహదారికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.


 ఏకంగా ఒకే రహదారిలో ఒకే చోట 600 కంటే ఎక్కువ మలుపులు ఉండడం ఇక ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన ఒక వీడియోలో చూడొచ్చు. పర్వతాలలో నివసించే పని చేసే ప్రజల కోసం 2019లో చైనా ప్రభుత్వం ఈ రోడ్డును నిర్మించింది. అయితే ఇది చైనీస్ కథలలో బాగా పాపులర్ అయిన వాటర్ డ్రాగన్ అయినా పాన్ లాంగ్ లాగా ఈ రహదారి కనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు  ఇక ఈ రహదారి ఏకంగా 4200 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది.. కొన్ని మలుపులు సగం సర్కిల్ కంటే ఎక్కువ ఉంటాయి అవి చూపరులు అందరిని కూడా ఆకట్టుకుంటాయి అని చెప్పాలి.


 అయితే ఇది ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసేందుకు ఎంతో ఈజీగానే ఉన్నప్పటికీ.. అటు ఈ రహదారిపై వాహనాలతో వెళ్లే డ్రైవర్లకు మాత్రం ఇక చుక్కలు కనిపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ దారి గుండా వెళుతున్న సమయంలో పక్కనే ఉన్న పర్వతాల అందాన్ని చూడాలా లేదంటే ప్రమాదకరమైన మలుపులతో ఉన్న రహదారిని చూడాలా ఆ డ్రైవర్లకు అస్సలు అర్థం కాదు. ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికైతే ఈ రహదారిపై వెళ్తుంటే కళ్ళు తిరుగుతాయి అని చెప్పాలి. అయితే రోడ్డు చాలా ఎత్తులో ఉంది. అలాంటి చోట్ల మలుపులు లేకుండా రహదారిని నిర్మిస్తారు చాలా నిటారుగా ఉంటుంది. అందుకే ఇలా మలుపులు తిప్పుతూ రోడ్డును నిర్మిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: