ఏపీలో ఎక్కువ ప్రజా మద్ధతు ఉన్న ఎమ్మెల్యేల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు...ఎమ్మెల్యేగా ప్రజలకు ఎలాంటి సేవలు చేయాలి...వారి సమస్యలని ఎలా పరిష్కరించాలనే అంశాలు చెవిరెడ్డికి బాగా తెలుసు...ఏదో ఎమ్మెల్యే అంటే అధికారం అని చెప్పి హడావిడి చేసే నేతల మాదిరిగా చెవిరెడ్డి ఉండరు..తనని గెలిపించిన ప్రజల కోసం ఏదొకటి చేయాలనే తపనతో ఉంటారు. అందుకే చంద్రగిరిలో చెవిరెడ్డి బలం ఏ మాత్రం తగ్గడం లేదు.

అసలు ఈ నియోజకవర్గం చంద్రబాబు సొంత నియోజకవర్గమనే సంగతి అందరికీ తెలిసిందే..1978లో కాంగ్రెస్ తరుపున చంద్రబాబు ఇక్కడ నుంచే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే...అయితే తర్వాత ఈయన టీడీపీలోకి వెళ్ళడం...నెక్స్ట్ కుప్పం స్థానానికి మారడం జరిగాయి. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లె ఈ నియోజకవర్గంలోనే ఉంది...ఇలా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన సరే ఇక్కడ టీడీపీ సత్తా చాటడం తక్కువ..గత రెండు ఎన్నికల్లో చంద్రగిరి ప్రజలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వరుసగా గెలిపించుకుంటున్నారు...ఇక మూడోసారి కూడా గెలిపించుకోవడానికి చంద్రగిరి ప్రజలు రెడీగానే ఉన్నారని చెప్పొచ్చు.

ఇక ఈయన గెలుపుని ఆపడం టీడీపీకి సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు..ఒకవేళ డైరక్ట్‌గా చంద్రబాబు...చంద్రగిరి బరిలో దిగిన చెవిరెడ్డికి చెక్ పెట్టడం కష్టమని చెప్పొచ్చు..అంటే అంతలా చంద్రగిరి ప్రజల మద్ధతు చెవిరెడ్డికి ఉంది...ఇలా ప్రజా మద్ధతు ఉన్న చెవిరెడ్డికి చెక్ పెట్టాలని టీడీపీ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తుంది..కానీ పెద్దగా చెవిరెడ్డి ఛాన్స్ ఇవ్వడం లేదు.

2014లో గల్లా అరుణ కుమారి స్వయంగా టీడీపీ నుంచి బరిలో దిగిన ప్రయోజనం లేకుండా పోయింది...ఇక 2019లో పులివర్తి నాని..చెవిరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు..ఇప్పుడు నాని ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు..అయితే నెక్స్ట్ ఎన్నికల్లో నాని..చెవిరెడ్డిపై పోటీ చేయడానికి ఆసక్తిగా లేరు..ఇక్కడ ఎలాగో ఓడిపోతామని అర్ధమవుతుంది..అందుకే ఆయన చిత్తూరు అసెంబ్లీకి మారిపోవాలని చూస్తున్నారు...మరి పులివర్తి నాని అటు వెళితే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎవరు పోటీ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: