శరవేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వచ్చే ఎన్నికల్లో తెలుగురాష్ట్రాల్లో పోటీ చేయాలని డిసైడ్ చేసింది. తెలంగాణాలో కన్నా ఏపీలో నిలదొక్కుకునేందుకే ఎక్కువ అవకాశం ఉందని ఆప్ నేతలంటున్నారు. ఎందుకంటే తెలంగాణాలో 2023 ఎన్నికల్లో అధికారం కోసం మూడు పార్టీల మధ్య ఫైట్ పీక్స్ లో ఉంది. అధికారాన్ని నిలుపుకునేందుకు టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.





అలాగే టీఆర్ఎస్ ను దెబ్బకొట్టి ఎలాగైనా అధికారాన్ని అందుకోవాల్సిందే అని ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆప్ కు కానీ మరోపార్టీకి కానీ అవకాశాలు తక్కువే. అధికారంలోకి వచ్చే అవకాశం ఆప్ కు లేదని కాదు. అసలు తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఆప్ కు రాబోయే ఎన్నికల్లో రాదనేది నిశ్చితాభిప్రాయం.





ఇదే సమయంలో తెలంగాణాతో పోలిస్తే ఏపిలో రాజకీయ వాతావరణమే ఆప్ కు కాస్త బెటర్ అన్నట్లుగా ఉంది. ఎలాగంటే అధికార వైసీపీ చాలా బలంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చాలా బలహీనంగా ఉంది. అధికారంలోకి రావటానికి ప్రయత్నించే విషయంలో టీడీపీ తప్ప మరోపార్టీకి అవకాశమే లేదు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీనే చాలా బలహీనంగా ఉందంటే ఇక జనసేన, బీజేపీ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు.





పార్టీ అధినేతగా పవన్ ఫెయిల్యూరయ్యారు. జనాలు పవన్ను ఏమాత్రం నమ్మటంలేదు. పార్టీ పెట్టి 8 ఏళ్ళయినా ఇంతవరకు పార్టీ నిర్మాణమే చేయలేదు.  ఎంతసేపు చంద్రబాబు ప్రయోజనాల కోసమే తప్ప పార్టీ కోసం పనిచేసినట్లు లేదు. అందుకనే ఆప్ దెబ్బ ఎక్కువగా జనసేన మీద పడుతుందనే అనుకుంటున్నారు. ఎందుకంటే జనసేనకన్నా ఆప్ మీద జనాల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో అరవిండ్ కేజ్రీవాల్ పాలన చూసిన తర్వాతే పంజాబ్ లో జనాలు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఆప్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపధ్యంలోనే ఏపీలో గనుక ఆప్ పోటీచేస్తే మొదటిదెబ్బ జనసేనకే పడుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: