
కాగా గత కొంతకాలంగా వినిపిస్తున్న ఒక విషయం గురించి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ లో ఉన్న సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మి నారాయణ అధ్యక్షుడుగా చేసి మళ్ళీ అధిష్టానం అసంతృప్తి చెందడంతో అతని స్థానంలో సోము వీర్రాజును నియమించారు. అప్పటి నుండి కన్నా పార్టీలో ఉండాలా వద్ద అన్న సందేహంలోనే ఉన్నారు. కానీ ఈమధ్య నుండి ప్రజలలో కాస్తో కూస్తో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు మైలేజ్ రావడంతో ఇప్పుడు ఆయన కన్ను జనసేపై పడింది. ఇక పవన్ కూడా సీనియర్ నాయకులు పార్టీలో ఉండడం మంచిదని భావించి ఆయనను పార్టీలోకి రమ్మని అడిగారు.
కానీ కన్నా మాత్రం పవన్ ముందు ఒక డిమాండ్ ఉంచారట. నేను జనసేనలోకి రావడానికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ నాకు సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ కావాలి అని తెలియచేశారట. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా ఉన్నారు. ఇద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో పోటీ ఇక్కడ బలంగా ఉండనుంది. అంత అనుకున్నట్లు జరిగితే మరో రెండు రోజుల్లో కన్నా జనసేన తీర్థం పుచ్చుకుంటారు.