జయలలిత మరణం తరువాత నుంచి తమిళ రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ముఖ్యమంత్రి కుర్చీకోసం శశికళ ఆరాటపడటం.. తదనంతర పరిణామాలతో రాష్ట్రంలో రాజకీయ రగడ మొదలైంది. దాదాపు 15రోజులుగా యావత్ భారతదేశం తమిళనాడు రాజకీయాల పైనే చర్చించింది. ఎంతలా అంటే.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కవరేజీని సైతం మీడియా మరచిపోయేంతగా. శశికళ కు జైలు శిక్ష ఖరారు కావడంతో.. తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు.. ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేదిశగా చర్యలు చేపట్టారు.


బుధవారం రాత్రి పళని స్వామి, పన్నీరు సెల్వంతో గవర్నర్ వేర్వేరుగా భేటీ అయ్యారు. 124 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని చెబుతూ, పళనిస్వామి, గవర్నర్ కు లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పళని స్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారని రాజ్ భవన్ వర్గాల సమాచారమందుతోంది. ఈ మేరకు మధ్యాహ్నం ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. పన్నీరు సెల్వం కూడా గవర్నర్ ను కలిసినప్పటికీ ఆయన తనకున్న మద్దతును నిరూపించుకోలేక పోయినట్లు తెలుస్తోంది. పైగా ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉన్నందున రాజ్యాంగ సూత్రాల ప్రకారం పళని స్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలేచే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు భావిస్తున్నారు. న్యాయ సలహా మేరకే రాజ్ భవన్ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


శశికళపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన నాటి నుండి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో పన్నీరు సెల్వం విపలమయ్యారనే చెప్పాలి. శశికళ అరెస్ట్ తరువాత ఎమ్మెల్యేలు తనకు మద్దతిస్తారని పన్నీరు కన్న కలలన్నీ కల్లలుగానే మిగిలిపోనున్నాయి. శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలంతా ఏకతాటిపై నిలబడి.. పళని స్వామి వెంటే ఉంటామని స్పష్టమైన సంకేతాలివ్వడంతో... ఆయనే కాబోయే ముఖ్యమంత్రని ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: