పోలీసు ఉద్యోగంలో చేరాలనే ఆసక్తి ఎంతో మందిలో ఉన్నా ఆ కోరిక కొంత మందికి మాత్రమే నెరవేరుతుంది.  పోలీసులు ఉదోగంలో చేతదానికి ప్రధానంగా కావాల్సిన, అందరికీ బయట కనబడే అర్హత ఎత్తు. పోలీసు ఉద్యోగ నియామకంలో నియమ నిబంధనలను కటినంగా వ్యవహరిస్తారు నియామక అధికారులు. అయితే కొంత మందికి పోలీసు కావడానికి అన్ని అర్హతలు ఉన్నా అందుకు తగ్గ ఎత్తు మాత్రం ఉండదు. ఒక సెంటీమీటరు ఎత్తు తక్కువ ఉన్నా సరే నిర్దాక్షిణ్యంగా ఆ అభ్యర్థిని బయటికి పంపిస్తారు. కొంత మంది మాత్రం అన్ని రకాల అర్హతలతో ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.


ఎక్కువ ఎత్తు కనిపించాలని..

కానీ ఒక యువకుడు పోలీసు ఉద్యోగానికి వెళ్లి అక్కడ అధికారులకు దొరికిపోయి అడ్డంగా బుక్కైనాడు. తాజాగా మహారాష్ట్రలో జ‌రుగుతున్న‌ పోలీసు నియామకాల్లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. త్రయంబకేశ్వర్ నుంచి వ‌చ్చిన‌ రాహుల్ పాటిల్ అనే అభ్య‌ర్థి తాను తక్కువ ఎత్తు ఉంటే ఎంపిక కానేమోనని భయప‌డ్డాడు. ఉద్యోగానికి ఎంపిక కావ‌డానికి ఉండాల్సిన ఎత్తు లేక‌పోయినా ఉద్యోగం కొట్టేయాల‌ని యోచించాడు. 


Image result for police recruitment

పోలీసు నియామకాల్లో ఎత్తును తల నుండి అరి కాళ్ల వరకు చూస్తారు కాబట్టి ఆ యువకుడు ఎత్తుగా కనబడడానికి విగ్గు పెట్టుకొని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే, ఎంతో మంది దొంగ‌ల్ని ప‌ట్టుకునే పోలీసుల‌కు ఆ విష‌యం క‌నిపెట్ట‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.. ఆ విష‌యాన్ని గుర్తించిన రిక్రూట్‌మెంట్‌లో ఉన్న అధికారులు ఆ విగ్గు ఊడ‌దీసి అతడిపై అనర్హత వేటు వేసి పంపించారు. చ‌ట్ట‌ప్ర‌కారం తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: