నేరం చేసిన వారు చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని మరోసారి రుజువు అయ్యింది.   డీడీల ఫోర్జరీ కేసులో కదిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు నిచ్చింది. హైదరాబాద్ లోని హుస్సేనీ అలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు ఫోర్జరీ డీడీలు సమర్పించి రూ.6 కోట్ల వరకు కందికుంట మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

కందికుంట వెంకట ప్రసాద్‌ 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కదిరి నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిపై విజయం సాధించారు. హుస్సేనీ అలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు ఫోర్జరీ డీడీలు సమర్పించి రూ.6 కోట్ల వరకు కందికుంట మోసం చేసినట్టు  ఆరోపణలు నేపథ్యంలో ఈ కేసుపై సీబీఐ ధర్మాసనం విచారణ జరిపింది.

కందికుంటతో పాటు,అసిస్టెంట్ మేనేజర్ నర్శింగరావుకు ఐదేళ్ల జైలు శిక్ష, ఇన్ స్పెక్టర్ వెంకటమోహన్ కు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.   ఇదిలా   గత ఏడాదిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసిన కేసులో మాజీ మంత్రి షాకీర్ కు, వెంకట ప్రసాద్ కు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించింది. ఆ కేసులో రూ.6 లక్షల జరిమానా కూడా ఆయనకు విధించింది. తాజాగా, ఎస్బీఐను మోసం చేసిన కేసులోనూ ఆయన శిక్ష పడటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: