ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా వెళ్లడం జరిగింది.  ఈ సందర్భంగా 15వ ఆర్థిక సంఘం విధివిధానాలపై ప్రధాని మోడీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించడం జరిగింది. తాజాగా చంద్రబాబు ఈ సమావేశానికి వెళ్లడంతో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తి నెలకొంది ముఖ్యంగా గత ఎన్నికలలో మోడీతో కలిసి  పోటీ చేసిన చంద్రబాబు తర్వాత తన స్వార్థ రాజకీయాల కోసం మోడీని బీజేపీ పార్టీని రాష్ట్రంలో దోషిగా చిత్రీకరించడం జరిగింది.
Image result for chandrababu
దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పై మీడియా క‌ళ్లు ఉన్నాయి. మరిముఖ్యంగా టీడీపీ పార్టీ ఎన్‌డిఎ కూటమి నుండి బ‌య‌టికి వ‌చ్చిన త‌రువాత ప్రధాని మోదీని మొద‌టిసారి క‌ల‌వ‌బోతున్నారు.దీంతో మీడియా ఫోక‌స్ మొత్తం వీరిద్ద‌రిపైనే ఉంది. సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ తన సీటులో కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు మోదీతో షేక్ హ్యాండ్ ఇచ్చారు.
Image result for chandrababu modi
ఆ స‌మ‌యంలో మోదీ చంద్ర‌బాబును పెద్దగా ప‌ట్టించుకోలేదు. మోదీ చంద్రబాబును పట్టించుకోకుండానే వెళ్లి, తన సీటులో ఆశీనులయ్యారు. దీంతో ఈ సన్నివేశాన్ని చూసిన అక్కడ కొంతమంది నాయకులు ప్రధాని మోడీ చంద్రబాబు విషయంలో ఏ విధంగా ఉన్నారో  అర్థమైంది..దీనంతటికి కారణం చంద్రబాబే వైఖరే అని అంటున్నారు సమావేశానికి వచ్చిన నాయకులు.
Related image
అయితే మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ఆ పార్టీకి కొమ్ముకాసే మీడియా మాత్రం బయటికి వేరేలా అంటే మోడీ పై చంద్రబాబు తిరగబడ్డాడు అన్న విధంగా ప్రసారాలు కార్యక్రమాలు చిత్రీకరిస్తోంది. మొత్తంమీద చూసుకుంటే చంద్రబాబుని కనీసం కూడా పట్టించుకోలేదు మోడీ అని అంటున్నారు ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: