- ఆముదాల వలస ఐటీడీఏలో ఇష్టారాజ్యం
కొందమంది అధికారులు గత ప్రభుత్వం లోనే ఉన్నట్టు వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఇప్పటికీ అదే ప్రభుత్వంలో కొనసాగుతున్నట్టు వారి ఇష్టానుసారంగా చేసుకుపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా అముదాలవలస ఐటీడీఏ విభాగంలో ఈ వ్యవహారం ఇప్పడు వివాధంగా మారింది. వివరాల్లోకెళ్తే.... 


ఆమదాలవలసలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కు అధికారిగా, కొత్తూరు ప్రాజెక్ట్ కు ఎసిడిపిఓగా పనిచేస్తున్న విమలరాణి కొన్ని నెలల క్రితం విధుల్లోకి చేరారు. అయితే ఆమె కొత్తూరు , ఆమదాలవలస రెండు ప్రాజెక్టులను చూస్తుండగానే మధ్యలో ఎన్నికలు వచ్చాయి. ఈ తరుణంలోనే ఆమదాలవలస ప్రాజెక్ట్ పరిధిలోని కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ పోస్టులకు నోటిఫికెషన్స్ ను అప్పటి పాలకుల మాటలు కాదనలేక విడుదల చేసారు. 


అయితే అప్పటికే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ FAC ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అత్యుత్సాహం చూపిస్తూ వంజంగి, జికె.వలస, చిట్టివలసలతోపాటు  ప్రాజెక్ట్ పరిధిలో మరికొన్ని గ్రామాల్లో పోస్టులను భర్తీచేశారు. ఎన్నికల ముందు మాజీ ప్రభుత్వం విప్ ఆదేశాలు మేరకు కార్యకర్తల నియామకాలు పిఓ కార్యాలయానికి వచ్చినప్పటికి కొత్తగా పోస్టింగులు వచ్చిన అభ్యర్థులకు ఆ నియామక పత్రాలు అందజేయకుండా గుట్టుగా ఉంచారు. కొత్తగా జాబ్ వచ్చిన వారికి ఎన్నికల ముందర ఆర్డర్స్ అందిస్తే కొంత మంది కార్యకర్తలు ఎదురు తిరిగారని, అందువలన ఎన్నికల తర్వాత ఆర్డర్లు ఇవ్వాలని విప్ ఆదేశించినట్లు సమాచారం. 


దీంతో కొత్తగా జాబ్ వచ్చిన వారికి ఎన్నికల తరువాత అనగా YSRCP అధికారంలోకి వచ్చాక FAC PO స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండా ఆర్డర్స్ అందచేసి, విధుల్లోకి అర్జెంట్గా చేరాలని ఆదేశించారు. దింతో కొత్తగా పోస్టింగులు వచ్చిన వారు విధుల్లోకి చేరారు. ఈ విషయంలో FACPO కు ఆయా గ్రామాల నుంచి ఒత్తిడి రావడంతో పాటు తానూ తప్పు చేశాను అనే కారణంతో వెంటనే సెలవుతీసుకొని వెళ్ళిపోయినట్టు సమాచారం. ఆ సెలవులో వెళ్ళిపోయిన తరువాత కార్యాలయంలో ఉద్యోగులతోపాటు , ప్రాజెక్ట్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పర్యవేక్షణ లోపించి, అధికారులంతా ఎవరికీ యమునా తీరే  అన్నట్టు పనిచేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: